Private junior college
-
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియెట్ ప్రథమ సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాకకు చెందిన యోగ నందిని (16) ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా సంక్రాంతి సెలవులకు వెళ్లి చాన్నాళ్ల తర్వాత కాలేజీకి తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆపై మళ్లీ ఇంటికి వెళ్లగా గురువారమే హాస్టల్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరైన నందిని ఆపై రెగ్యులర్ తరగతులకు కూడా వెళ్లింది. మధ్యలో తన ఆరోగ్యం బాగాలేదని హాస్టల్ గదికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతోంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, నందిని మృతి సమాచారం తెలుసుకుని వచ్చిన ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, యోగనందిని కుడి చేతికి సర్జరీ కావడం, ఆ బాధతో పరీక్షలు రాయలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు -
కాలేజీలకు అఫిలియేషన్ ఫీజు తగ్గింపు
మే 5 వరకు దరఖాస్తుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజును ఇంటర్మీడియెట్ బోర్డు తగ్గించింది. గతంలో మూడింతలు పెంచిన ఫీజును రెండింతలకు పరిమితం చేసింది. జనరల్ కాలేజీలతోపాటు ఒకేషనల్ కాలేజీల ఫీజులనూ తగ్గించింది. ప్రతి కాలేజీ అఫిలియేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని కాలేజీలకు విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకునే వీలు ఉండదని పేర్కొంది. ఈసారి విద్యార్థుల ప్రవేశాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపింది. ఆధార్ నంబర్ లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది. కాలేజీ యాజమాన్యాలు ఈ నెల 5 వరకు లేకుండా అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 8 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. -
ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల కనీస పెంపు 38 శాతం!
సిఫారసు చేసిన ఉన్నతాధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 3 వేల వరకు ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో త్వరలో 38 శాతం నుంచి 42 శాతం వరకు వార్షిక ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల డిమాండ్‌తో ఏర్పాటైన ఈ కమిటీ యాజమాన్యాలతో చర్చించి ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రకారం కనీసంగా 38 శాతం, గరిష్టంగా 42 శాతం ఫీజులను పెంచనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం వార్షిక ఫీజు రూ.1760 ఉండగా, ద్వితీయ సంవత్సర ట్యూషన్ ఫీజు రూ. 1940గా ఉంది. అది సరిపోవడం లేదన్న యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పెంపు చర్యలు చేపట్టింది. వాస్తవానికి 1997లో జారీ చేసిన జీవో నెంబరు 102 ప్రకారం జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులపై ఏటా 10 శాతం పెంచాల్సి ఉంది. అయితే 2014–15, 2015–16, 2016–17 విద్యా సంవత్సరాల్లో అది అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ మూడేళ్లకు గాను ట్యూషన్ ఫీజులను 30 శాతం పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. ఆ ప్రకారం ప్రథమ సంవత్సర ఫీజు రూ. 2,360, ద్వితీయ సంవత్సర ఫీజు రూ. 2,600 కానుంది. దీనికి అదనంగా 2017–18 విద్యా సంవత్సరంలో మరో 8 శాతం నుంచి 12 శాతం ఫీజు పెంపు ఏర్పాట్లు చేస్తోంది. కమిటీ సిఫారసుల మేరకు మండల స్థాయిలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 8 శాతం, మున్సిపాలిటీ స్థాయిల్లో 10 శాతం, కార్పొరేషన్ స్థాయిలో 12 శాతం అదనపు పెంపును 2017–18 విద్యా సంవత్సరంలో అమలు చేయనుంది. దీంతో ఫీజుల పెంపు రూ. 38 శాతం నుంచి 42 శాతంగా ఉండనుంది. అదనపు భారం రూ. 26 కోట్లు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న 4,20,387 మంది విద్యార్థులకు ప్రస్తుత ఫీజుల ప్రకారం రూ. 77.69 కోట్లు వెచ్చిస్తుండగా, 30 శాతం పెంపుతో రూ. 104.15 కోట్లు కానుంది. అంటే అదనంగా రూ. 26.45 కోట్లు ఏటా వెచ్చించాలి. ఇక ఈ విద్యా సంవత్సరానికి చేసే పెంపు ఈ మొత్తానికి అదనం. అడిగిన దానికి.. ప్రతిపాదిత ఫీజుకు మధ్య ఎంతో అంతరం యాజమాన్యాలు అడిగిన ఫీజుకు, కమిటీ సిఫార్సు చేసిన ఫీజుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆర్ట్స్ గ్రూపులకు మండల స్థాయిలో రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంచాలని, మున్సిపాలిటీ స్థాయిలో రూ. 9 వేల నుంచి రూ. 11 వేలకు పెంచాలని, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలోని కాలేజీల్లో ఫీజును రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి. అలాగే సైన్స్ గ్రూపు ఫీజును మండల స్థాయిలో కాలేజీల్లో రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు, మున్సిపాలిటీ స్థాయిలో రూ. 15 వేల నుంచి రూ. 18 వేలకు , మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి. అందులో సగం పెంపునకు కూడా సిఫారసు చేయకపోవడంతో యాజమాన్యాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ కాగానే వాటిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొంటున్నాయి. -
మిస్టరీ వీడని విద్యార్థినుల అదృశ్యం కేసు
తిరువూరు : పట్టణానికి చెందిన ఇరువురు విద్యార్థినులు 15 రోజుల క్రితం అదృశ్యమైన ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపింది. ఈ కేసు మిస్టరీ ఇంతవరకూ వీడలేదు. తిరువూరు రాజుపేటకు చెందిన ధర్మపురి రాంబాబు కుమార్తె ఉమామహేశ్వరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి, రోలుపడి శివారు సూరవరానికి చెందిన గోసు శ్రావణి స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. ఈ నెల 4 నుంచి కనిపించడంలేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల కోసం తాము బంధువుల ఇళ్లలో, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి దర్యాప్తులో బాలికలు ఇద్దరు మహిళలతో ఫోనులో మాట్లాడినట్టు గుర్తించారని పేర్కొన్నారు. బాలికల ఆచూకీ లభ్యం కాలేదని ఏఎస్ఐ మోహనరావు తెలిపారు. -
వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఎంజీఎం (వరంగల్): వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భీమారంలోని శ్రీ విద్వాన్ జూనియర్ కళాశాలలో మరిపెడ మండలం ఏడుచర్ల గ్రామ సమీపంలోని గురుపతండాకు చెందిన బానోతు భాస్కర్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థి సినిమా చూసిన అనంతరం రాత్రి పది గంటలకు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో భాస్కర్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. ‘నా పేరు భాస్కర్. శ్రీ విద్వాన్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదవుతున్నాను. నాకు తండ్రి లేడు. అమ్మతో పాటు అక్కబావ ఉన్నారు. ఇందులో వారి సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నేను క ళాశాల నుంచి రాత్రి వచ్చాను. విద్వాన్ క ళాశాల వేస్ట్ కళాశాల, దానిని క్లోజ్ చేయండి. నేను మందు తాగి చనిపోతున్నాను. ఇందులో సినిమా థియేటర్ వాళ్ళ తప్పు ఏమీ లేదు. వారిని అరెస్టు చేయవద్దు’. అని లేఖలో పేర్కొన్నాడు. కళాశాలలో ఫీజు కోసం యాజమాన్యం ప్రవర్తించిన తీరు వల్లనే భాస్కర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నాకి ఓడిగట్టినట్లు బంధు మిత్రులు ఆరోపిస్తున్నారు. కాగా, భాస్కర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
22 జూనియర్ కాలేజీలు మనుగడలో లేవు ఇంటర్మీడియట్ ఆర్ఐవో వెంకటేశ్వరరావు ఖమ్మం : జిల్లాలో అనుమతిలేని, ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు చేరకూడదని ఇంటర్మీడియట్ జిల్లా పర్యవేక్షణాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించే వసతిగృహాలు స్థానిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్న భవనాల్లో కోచింగ్‌సెంటర్లు, ఇతర అకాడమిలు నిర్వహించరాదని, నిర్వహిస్తే ఏ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో తెలుపాలన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనల మేరకే తరగతులు నిర్వహించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోర్డు ఆదేశాల మేరకే బోధన, ఇతర రుసుములు తీసుకోవాలని, ఎక్కువ తీసుకుంటే శిక్షార్హులన్నారు. పనిచేయని కళాశాలలు ఇవే.. జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు మనుగడలో లేవని ఆర్ఐవో తెలిపారు. మూడు సంవత్సరాలుగా ఎటువంటి ప్రవేశాలు లేకుండా క్లాసులు నిర్వహించకుండా ఉన్నందున ఈ కళాశాలలను నాట్ ఫంక్షనింగ్‌లో పెట్టామన్నారు. వీటిలో మ్యాట్రిక్స్ (ఖమ్మం), వాణి జూనియర్ కాలేజీ (ఖమ్మం), ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ (ఖమ్మం), కిన్నెర ఒకేషనల్ జూనియర్ కాలేజీ (ఖమ్మం), నిర్మల ఒకేషనల్ జూనియర్ కళాశాల (ఖమ్మం), భారత్ జూనియర్ కాలేజీ (కొత్తగూడెం), కేఎల్ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్ఆర్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్వీ ఒకేషనల్జూనియర్ కళాశాల (ఖమ్మం), కృషి జూనియర్ కాలేజీ (వేంసూరు), గౌతమి జూనియర్ కాలేజీ (పాల్వంచ), ఎస్వీజీఎస్ జూనియర్ కాలేజీ (కొణిజర్ల), పులిపాటి ప్రసాద్జూనియర్ కాలేజీ (అమ్మపాలెం), భారతి ఒకేషనల్ జూనియర్‌కాలేజీ (వైరా),మదర్ థెరిసా జూనియర్ కాలేజీ (మణుగూరు), అటమిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీ (అశ్వాపురం), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (తిరుమలాయపాలెం), శ్రీచైతన్య జూనియర్‌కాలేజీ (నేలకొండపల్లి), న్యూవిజన్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ (నేలకొండపల్లి), పీబీసీఎస్ఈఎల్ జూనియర్ కాలేజీ (సారపాక), శ్రీవాణి జూనియర్‌కాలేజీ (సారపాక), ఎస్వీజీఎస్ జూనియర్‌కాలేజీ (బోనకల్) ఉన్నాయని తెలిపారు.