22 జూనియర్ కాలేజీలు మనుగడలో లేవు
ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో వెంకటేశ్వరరావు
ఖమ్మం : జిల్లాలో అనుమతిలేని, ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు చేరకూడదని ఇంటర్మీడియట్ జిల్లా పర్యవేక్షణాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించే వసతిగృహాలు స్థానిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్న భవనాల్లో కోచింగ్‌సెంటర్‌లు, ఇతర అకాడమిలు నిర్వహించరాదని, నిర్వహిస్తే ఏ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో తెలుపాలన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనల మేరకే తరగతులు నిర్వహించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోర్డు ఆదేశాల మేరకే బోధన, ఇతర రుసుములు తీసుకోవాలని, ఎక్కువ తీసుకుంటే శిక్షార్హులన్నారు.
పనిచేయని కళాశాలలు ఇవే..
జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు మనుగడలో లేవని ఆర్‌ఐవో తెలిపారు. మూడు సంవత్సరాలుగా ఎటువంటి ప్రవేశాలు లేకుండా క్లాసులు నిర్వహించకుండా ఉన్నందున ఈ కళాశాలలను నాట్ ఫంక్షనింగ్‌లో పెట్టామన్నారు. వీటిలో మ్యాట్రిక్స్ (ఖమ్మం), వాణి జూనియర్ కాలేజీ (ఖమ్మం), ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ (ఖమ్మం), కిన్నెర ఒకేషనల్ జూనియర్ కాలేజీ (ఖమ్మం), నిర్మల ఒకేషనల్ జూనియర్ కళాశాల (ఖమ్మం), భారత్ జూనియర్ కాలేజీ (కొత్తగూడెం), కేఎల్‌ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్‌వీ ఒకేషనల్‌జూనియర్ కళాశాల (ఖమ్మం), కృషి జూనియర్ కాలేజీ (వేంసూరు), గౌతమి జూనియర్ కాలేజీ (పాల్వంచ), ఎస్‌వీజీఎస్ జూనియర్ కాలేజీ (కొణిజర్ల), పులిపాటి ప్రసాద్‌జూనియర్ కాలేజీ (అమ్మపాలెం), భారతి ఒకేషనల్ జూనియర్‌కాలేజీ (వైరా),మదర్ థెరిసా జూనియర్ కాలేజీ (మణుగూరు), అటమిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీ (అశ్వాపురం), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (తిరుమలాయపాలెం), శ్రీచైతన్య జూనియర్‌కాలేజీ (నేలకొండపల్లి), న్యూవిజన్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ (నేలకొండపల్లి), పీబీసీఎస్‌ఈఎల్ జూనియర్ కాలేజీ (సారపాక), శ్రీవాణి జూనియర్‌కాలేజీ (సారపాక), ఎస్‌వీజీఎస్ జూనియర్‌కాలేజీ (బోనకల్) ఉన్నాయని తెలిపారు.
అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
Published Fri, Jul 3 2015 4:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement