
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకుని వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదనపు కోటాకింద ప్రత్యేక సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చలికాలాన్ని దృష్టి లో పెట్టుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా నాణ్యమైన దుప్పట్లు, పరుపులు ఎస్సీ అభివృద్ధి శాఖ పంపిణీ చేస్తోంది. అలాగే 2 రకాల బూట్లు, స్కూల్ బ్యాగులనూ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 865 వసతి గృహాలున్నాయి. వీటిలో 677 ప్రీమెట్రిక్, 188 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో దాదాపు 40వేల మంది పిల్లలు వసతి పొందుతున్నారు.
తాజాగా ఈ విద్యార్థులకు 2 రకాల వస్తువులను ఆ శాఖ అందించింది. దాదాపు 12.5 కోట్లు ఖర్చు చేసి మెటీరియల్‌ను కొనుగోలు చేసి వసతి గృహాలకు అందజేసింది. ప్రస్తుతం వసతి గృహ సంక్షేమాధికారులు పంపిణీని మొదలుపెట్టారు. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment