
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దేశంలో ఎక్కడ ఉన్నత విద్యను అభ్యసించినా పూర్తి ఫీజులను చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం ఒకేలా ఉండేదన్నారు.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు ఒకలా, బీసీలకు ఇంకోలా ఫీజు విధానాలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు నిబంధన లేకుండా ఫీజులు చెల్లిస్తూ, బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. దీనిపై తక్షణమే సీఎం జోక్యం చేసుకుని పదివేల ర్యాంకు నిబంధన ఎత్తేయాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment