జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ | Fee Discount For Journalists Children In Schools In West Godavari | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ

Published Mon, Jul 1 2019 6:22 PM | Last Updated on Mon, Jul 1 2019 6:27 PM

Fee Discount For Journalists Children In Schools In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈఓ రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వుల ప్రకారం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాటిటైట్‌ న్యూస్‌ చానల్స్‌ స్టాఫ్‌ రిపోర్టర్స్‌ అసోషియన్‌కు డీఈఓ ఈ ఉత్తర్వులను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డీవైఈఓలు, ఎమ్‌ఈఓలు తక్షణమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థ జర్నలిస్టుల పిల్లలకు ఈ మేరకు రాయితీ కల్పించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement