journalists children
-
జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈఓ రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వుల ప్రకారం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 100 శాతం ఫీజు రాయితీ పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాటిటైట్ న్యూస్ చానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్ అసోషియన్కు డీఈఓ ఈ ఉత్తర్వులను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డీవైఈఓలు, ఎమ్ఈఓలు తక్షణమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థ జర్నలిస్టుల పిల్లలకు ఈ మేరకు రాయితీ కల్పించాలన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య
మెదక్ మున్సిపాలిటీ : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించే అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్లూజే హెచ్143) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలన్నారు. ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, స్టిఫెన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రహమత్, దుర్గెష్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు అక్రిడేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఈఓ అంజయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యా సంస్థల యాజమాన్య ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఏ ఒక్క విద్యాసంస్థపై ఫిర్యాదు రాకూడదన్నారు. కలెక్టర్ ఆదేశాలను గౌరవించి వంద శాతం అమలు చేయాలని చెప్పారు. అభ్యంతరాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని డీఈఓని ఆదేశించారు పరిశ్రమలకు చేయూతనివ్వాలి : జిల్లాలో పరిశ్రమలకు చేయూతనివ్వాలని అధికారులను జా యింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఐపీసీ స మావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా పె ట్టుబడి సబ్సిడీ, పవర్ కాస్ట్, అమ్మకపు పన్ను, పావలా వడ్డీ తదితర రాయితీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మా ట్లడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 31లోగా సర్వే పూర్తి చేయాలి :మునిసిపాలిటీల్లో ఈ నెల 31వ తేదీలోగా ప్రజా సాధికార సర్వే వంద శాతం పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాడిపత్రి మునిసిపిలిటీలో 70.88 శాతం జరిగిందన్నారు. మిగతా చోట్ల కూడా వేగవంతం చేసి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.