అనంతపురం అర్బన్: కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు అక్రిడేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో డీఈఓ అంజయ్య, ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యా సంస్థల యాజమాన్య ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఏ ఒక్క విద్యాసంస్థపై ఫిర్యాదు రాకూడదన్నారు. కలెక్టర్ ఆదేశాలను గౌరవించి వంద శాతం అమలు చేయాలని చెప్పారు. అభ్యంతరాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని డీఈఓని ఆదేశించారు
పరిశ్రమలకు చేయూతనివ్వాలి : జిల్లాలో పరిశ్రమలకు చేయూతనివ్వాలని అధికారులను జా యింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఐపీసీ స మావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా పె ట్టుబడి సబ్సిడీ, పవర్ కాస్ట్, అమ్మకపు పన్ను, పావలా వడ్డీ తదితర రాయితీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మా ట్లడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
31లోగా సర్వే పూర్తి చేయాలి :మునిసిపాలిటీల్లో ఈ నెల 31వ తేదీలోగా ప్రజా సాధికార సర్వే వంద శాతం పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాడిపత్రి మునిసిపిలిటీలో 70.88 శాతం జరిగిందన్నారు. మిగతా చోట్ల కూడా వేగవంతం చేసి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి
Published Thu, Aug 18 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement
Advertisement