acredetation cards
-
వాళ్లకు వేళకు తిండి, నిద్ర ఉండవు..
సాక్షి, జమ్మికుంట : రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు సమయానికి తిండి, నిద్ర ఉండవని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని, జర్నలిస్టులకు కనీస వేతనం ఇచ్చేలా మా తరపున తప్పక కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిరుపేద జర్నలిస్టులకు తప్పక ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం. హెల్త్ కార్డుల విషయంలో జరిగిన పొరపాట్లను తప్పక సవరిస్తాం. జర్నలిస్టుల కుటుంబాలలో ఎన్ని బాధలు, కష్టాలుంటాయో నాకు తెలుసు. అలాంటి కుటుంబాలకు వాళ్ల ఇంట్లో సభ్యుడిగా ఉండి ఆదుకుంటాం. ఎవ్వరికైనా ఎక్కడైనా ఏం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాలను ఆదుకుంటున్నాం. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతిబిడ్డకి ఏదో ఓ రూపంలో సమాయం అందుతుంది. రానున్న రోజుల్లో కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నామని’ ఆయన వివరించారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు అక్రిడేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఈఓ అంజయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యా సంస్థల యాజమాన్య ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఏ ఒక్క విద్యాసంస్థపై ఫిర్యాదు రాకూడదన్నారు. కలెక్టర్ ఆదేశాలను గౌరవించి వంద శాతం అమలు చేయాలని చెప్పారు. అభ్యంతరాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని డీఈఓని ఆదేశించారు పరిశ్రమలకు చేయూతనివ్వాలి : జిల్లాలో పరిశ్రమలకు చేయూతనివ్వాలని అధికారులను జా యింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఐపీసీ స మావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా పె ట్టుబడి సబ్సిడీ, పవర్ కాస్ట్, అమ్మకపు పన్ను, పావలా వడ్డీ తదితర రాయితీలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మా ట్లడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 31లోగా సర్వే పూర్తి చేయాలి :మునిసిపాలిటీల్లో ఈ నెల 31వ తేదీలోగా ప్రజా సాధికార సర్వే వంద శాతం పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాడిపత్రి మునిసిపిలిటీలో 70.88 శాతం జరిగిందన్నారు. మిగతా చోట్ల కూడా వేగవంతం చేసి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. -
అక్రిడేషన్లను మంజూరు చేయాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన ్లను మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. గురుబ„ŠSమజాతి కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.షఫివుల్లా, రాష్ట్ర నాయకులు రామాంజినేయులు, ఏపీ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.రామాంజినేయులు, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.