ఐఐఎంలో పీజీ ఫీజు రూ.22 లక్షలు | IIM-Ahmedabad raises PG management program fee to Rs22 lakh | Sakshi
Sakshi News home page

ఐఐఎంలో పీజీ ఫీజు రూ.22 లక్షలు

Published Sun, Mar 25 2018 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

IIM-Ahmedabad raises PG management program fee to Rs22 lakh - Sakshi

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం–ఏ)లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఫీజు పెరిగింది. 2018–20 బ్యాచ్‌కు గాను రూ.21లక్షల నుంచి రూ.22 లక్షలకు పెంచుతున్నట్లు ఐఐఎం డైరెక్టర్‌ డీసౌజా తెలిపారు. శనివారం ఐఐఎం బోర్డు సభ్యులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతేడాది రూ.19.5 లక్షలున్న ఫీజును 21 లక్షలకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజును ఏడాదికి 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఫీజులో  5శాతం పెరుగుదల ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement