
ఫీజు బకాయిలు విడుదల చేయండి
ఫీజు బకాయిలు 8 రోజుల్లోగా చెల్లించక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.
ప్రభుత్వం రూ.1800 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లిం చకపోవడంతో యాజమాన్యాలు మెమోలు ఇవ్వడంలేదని, కొత్తగా కోర్సుల్లో చేరాలంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నట్లుగా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, కుట్ల శ్రీనివాస్, పి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.