ఆన్‌లైన్ ద్వారా ఫీజుల వసూలు
Published Sun, May 21 2017 12:31 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ: దూరవిద్య విభాగంలో ఆన్‌లైన్ విధానం ద్వారా కోర్సు ఫీజులు వసూలు చేయనున్నామని డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు తెలిపారు. ‘ చెక్కు నొక్కేసీ.. ఆపై బుకాయింపు ’ అనే శీర్షికతో సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆయన స్పందించారు. రూ.39 లక్షల డీడీ (డిమాండ్ డ్రాప్టు)లు సకాలంలో బ్యాంకుకు పంపడంలో సిబ్బంది అలసత్వంతో వెనక్కు వచ్చాయి. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు ఆదేశాలతో గడువు ముగిసిన డీడీలను ఆయా బ్రాంచుల బ్యాంకులకు పంపి రీవ్యాలిడేట్ చేయించామన్నారు. దీంతో రూ.39 లక్షలు వర్సిటీకి ఆదా అయిందన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారానే అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టనున్నామన్నారు.
Advertisement