నాలుగేళ్ల పిల్లాడు ఎల్‌కేజీలో చేరాలంటే అక్షరాలా రూ.25 వేలు చెల్లించాలట! ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. దీంతోపాటు డొనేషన్, బిల్డింగ్ ఫండ్, రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, రవాణా, యూనిఫాం, పుస్తకాలు, పెన్నుల ఖర్చులు అదనం. అంతా కలిపి ఎల్‌కేజీ పూర్తి చేయడానికి రూ.50 వేలకు పైగా సమర్పించుకోవాల్సిందే.