
ముగిసిన ఉపవాస ప్రార్థనలు
కోదాడ రూరల్: స్థానిక గాంధీనగర్‌లోని దైవస్వరూపి చర్చిలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉపవాస ప్రార్థనలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు పట్టణానికి చెంది పాస్టర్ డి.యోహాను బైబిల్ సందేశాన్ని వినిపించారు. ఏసుక్రీస్తు అందరికి ప్రభువు అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు కురవాలంటూ, పంటలు బాగా పండాలంటూ ప్రత్యేక ప్రార్థనలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కలపాల సుధాకర్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.