prays
-
అమ్మ ఆరోగ్యం తిరిగి రావాలి: సుమన్
-
ముగిసిన ఉపవాస ప్రార్థనలు
కోదాడ రూరల్: స్థానిక గాంధీనగర్‌లోని దైవస్వరూపి చర్చిలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉపవాస ప్రార్థనలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు పట్టణానికి చెంది పాస్టర్ డి.యోహాను బైబిల్ సందేశాన్ని వినిపించారు. ఏసుక్రీస్తు అందరికి ప్రభువు అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు కురవాలంటూ, పంటలు బాగా పండాలంటూ ప్రత్యేక ప్రార్థనలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కలపాల సుధాకర్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
సకల సౌభాగ్యాలు ప్రసాదించు తల్లీ
– జోగుళాంబ అమ్మవారిని దర్శించి పూజించిన సీఎం కేసీఆర్ – ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుటుంబ సమేతంగా రాక అలంపూర్ / అలంపూర్‌రూరల్/ మానవపాడు : ‘అమ్మా జగజ్జననీ.. లోకపావనీ రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అలంపూర్‌లోని ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా సీఎం హోదాలో తొలిసారిగా దర్శించుకున్నారు. అంతకుముందు వారిని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఏసీ కష్ణ, ఈఓ గురురాజ, ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదట బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. వారికి ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ క్షేత్ర ప్రాశస్థ్యాన్ని తెలియ జేసి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కరపత్రం లేదా? అమ్మవారి ఆలయాన్ని తెలియజేసే బ్రోచర్, పుస్తకం, కరపత్రం వంటి వాటిని ముద్రించలేదా..? అని సీఎం కేసీఆర్ అర్చకులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఏసీ కష్ణ వెంటనే ఆలయ చరిత్రను తెలియజేసే కరప్రతాలను సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయాలను అభివద్ధిచేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన జనం సీఎంను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భద్రత కారణాల దష్ట్యా సెక్యూరిటీ బయటి వారిని లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆలయంలో సీఎం సుమారు గంట పాటు ఉన్నారు. -
కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!
గౌహతిః అసోం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తెల్లవారుజాము కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి బీజేపీకే విజయం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో... వెనుకబడిపోతున్న కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాలని కోరుతూ గోగోయ్ కామాఖ్య మాతను దర్శించి ప్రార్థించారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో పదిహేనేళ్ళుగా పాలనలో ఉన్న తమ పార్టీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ గట్టెంకించమని గోగోయ్ ఉదయం కామాఖ్య మాతను కోరుకున్నారు. ఫలితాల లెక్కింపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయాన్ని దర్శించిన అనంతరం... ప్రజలే నిర్ణయాన్ని తీసుకుంటారని, ఫలితాలు ఎలా ఉన్నా శిరస్సావహించాల్సిందేనని అన్నారు. అయితే ప్రస్తుతం తమ విజయంతోపాటు, ప్రజలను రక్షించేందుకు కామాఖ్య మాత తప్పనిసరిగా సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
హజి అలీ దర్గాలో ప్రవేశించిన తృప్తీ దేశాయ్
ముంబైః భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీదేశాయ్ ముస్లింల పవిత్ర క్షేత్రాలనూ వదల్లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై పోరాడి ఫలితాలను సాధిస్తున్న ఆమె..... తన మద్దతుదారులతో కలసి, తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించి సంచలనం రేపింది. పలువురు మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు భారీ బందోబస్తుతో తృప్తి దేశాయ్...ముంబైలోని ముస్లిం పవిత్ర క్షేత్రం హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, సంప్రదాయ బంధనాలను తెంచుకొని ఆమె.. గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అయితే దర్గాలోని గర్భాలయంలోకి మాత్రం ఆమె ప్రవేశించలేదు. దర్గా ఆచారాలను అనుసరించి, ట్రస్ట్ సభ్యుల అనుమతితో, పోలీసు బందోబస్తుతో దర్గాలోకి ప్రవేశించిన తృప్తి... అక్కడ ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోపు మరోసారి దర్గాలోని పురుషులు మాత్రమే ప్రవేశించే ముఖ్య ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే ప్రార్థనలు జరుపుతామంటూ వ్యాఖ్యానించారు. తృప్తి దేశాయ్, ఆమె మద్దతు దారులు, ఇంతకు ముందే ఓసారి దర్గాలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా... పోలీసులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతిపై లింగ వివక్షను విడనాడాలంటూ పోరాడుతున్న తృప్తి దేశాయ్... శనిసింగనాపూర్, త్రంయబకేశ్వర్ హిందూ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఎంచుకున్నారు. త్వరలోనే మహిళలను దర్గాలోని నిషేధ ప్రాంతానికి కూడ అనుమతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎస్ఐ చర్చి ప్రారంభం.. వైఎస్ జగన్ ప్రార్థనలు
-
సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
-
సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ చర్చి ప్రారంభమైంది. ఈ చర్చిని గురువారం ఉదయం మోడరేటర్ జి.దైవ ఆశీర్వాదం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులతో పాటు రాయలసీమ బిషప్ ప్రసాదరావు, మత గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ పూజలు
వెంకటాచలం: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరీ మస్తాన్‌వలి దర్గాను బుధవారం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దర్శించుకున్నారు. తొలుత స్థానిక ముజావర్లు మహ్మద్, సులేమాన్ ఆసీఫ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి సమాధి మందిరంపై ఏఆర్ రెహమాన్‌తో చాదర్‌ను వేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జగన్‌ను సీఎంగా చూడాలని మొక్కులు