కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్! | Gogoi prays to Kamakhya, Congress trails | Sakshi
Sakshi News home page

కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!

Published Thu, May 19 2016 11:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్! - Sakshi

కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!

గౌహతిః అసోం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తెల్లవారుజాము కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి బీజేపీకే విజయం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో...  వెనుకబడిపోతున్న కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాలని  కోరుతూ గోగోయ్ కామాఖ్య మాతను దర్శించి ప్రార్థించారు.

మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో పదిహేనేళ్ళుగా పాలనలో ఉన్న తమ పార్టీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ గట్టెంకించమని గోగోయ్ ఉదయం కామాఖ్య మాతను కోరుకున్నారు. ఫలితాల లెక్కింపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయాన్ని దర్శించిన అనంతరం... ప్రజలే నిర్ణయాన్ని తీసుకుంటారని,  ఫలితాలు ఎలా ఉన్నా శిరస్సావహించాల్సిందేనని అన్నారు. అయితే ప్రస్తుతం తమ విజయంతోపాటు, ప్రజలను రక్షించేందుకు  కామాఖ్య మాత తప్పనిసరిగా సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement