
ఉపవాసంతో ఒత్తిడి దూరం..
అప్పుడప్పుడు ఉపవాసం చేసే అలవాటు మంచిదే. ఉపవాసాలు చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు, ఒత్తిడిని కూడా
అప్పుడప్పుడు ఉపవాసం చేసే అలవాటు మంచిదే. ఉపవాసాలు చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు, ఒత్తిడిని కూడా అధిగమించవచ్చని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం వల్ల శరీరంలో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు తయారవుతాయని, దీనివల్ల వయసు మళ్లే ప్రక్రియ మందగిస్తుందని, తద్వారా దీర్ఘయవ్వనం కూడా సాధ్యమవుతుందని వారు వివరిస్తున్నారు.
ఇరవై నాలుగు మంది వాలంటీర్లను నమూనాగా తీసుకుని నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు శాస్త్రీయంగా తెలుసుకోగలిగారు.