ఇలా తింటే వ్యాధులు దూరం.. | Intermittent Fasting May Cut Risks For Diabetes | Sakshi
Sakshi News home page

ఇలా తింటే వ్యాధులు దూరం..

Published Fri, Dec 6 2019 9:50 AM | Last Updated on Fri, Dec 6 2019 9:51 AM

Intermittent Fasting May Cut Risks For Diabetes - Sakshi

రోజుకు 14 గంటల ఫాస్టింగ్‌తో వ్యాధులను దూరం చేయవచ్చని పరిశోధకులు తాజా అథ్యయనంలో వెల్లడించారు.

న్యూయార్క్‌ : రోజుకు 14 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా మిగిలిన పది గంటల్లో కొద్దిపాటి విరామం ఇస్తూ ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహం, స్ర్టోక్‌, గుండె జబ్బుల ముప్పు తప్పుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు పది గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం, కొలెస్ర్టాల్‌ అదుపులో ఉండటం వంటి అదనపు ప్రయోజనాలూ చేకూరతాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా చేపట్టిన అథ్యయనం వెల్లడించింది.

అథ్యయనంలో భాగంగా తాము ఎంపిక చేసుకున్న వారిని 12 వారాల పాటు రోజుకు 14 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోరాదని, మిగిలిన పదిగంటల్లో వారికిష్టమైన సమయంలో ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 12 వారాల అనంతరం అథ్యయనంలో పాల్గొన్న వారి శరీరంలో కొవ్వు నిల్వలు, బీఎంఐ, బరువు మూడు శాతంపైగా తగ్గిన్టు గుర్తించారు. వీరిలో పలువురికి షుగర్‌ నిల్వలు కూడా తగ్గాయి. మరోవైపు 70 శాతం మంది తాము గతంలో కంటే మెరుగ్గా నిద్రించామని చెప్పుకొచ్చారు. 14 గంటల పాటు ఏమీ తినకుండా పదిగంటల్లో ఆహారం తీసుకునే సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement