అపురూప మాసం ఆరంభం | A healthy and safe fast in the month of Ramadan | Sakshi
Sakshi News home page

అపురూప మాసం ఆరంభం

Published Sun, Jun 29 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

A healthy and safe fast in the month of Ramadan

నేటి నుంచి రంజాన్ దీక్షలు ప్రారంభం
ముంబై : ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే దిగి వచ్చిందన్నది వారి నమ్మకం. ఈ నెలలో ఉపవాస దీక్ష చేస్తారు. ఉపవాసంతో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయని, ఇలా శరీ రాన్ని శుష్కింపచేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందని భావిస్తారు. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన రంజాన్‌ను ఆది వారం సాయంత్రం కనిపించే నెలవంకతో ప్రారంభించనున్నట్లు మతగురువులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
రంజాన్ మాసంలో ముస్లింలు తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకొంటారు. ఉపవాసంతోపాటు దైవారాధన, దాన ధర్మాలు చేస్తా రు. ఉపవాస వ్రతం మనిషిలో త్యాగం, కారుణ్యం, సానుభూతి, ప్రేమ వంటి భావాలను కలిగిస్తుంది. ఉపవాసం ఒక నిర్బంధ సైని క శిక్ష లాంటిదని చెప్పవచ్చు. రంజాన్ మాసంలో ఉపవాస సమయంలో మనిషి పాప కార్యాలకు పాల్పడడు. అబద్ధానికి, అన్యాయానికి, పరనిం దకు దూరంగా ఉంటాడు. సుమారు 30 రోజుల పాటు ఈ మాసంలో దీక్షలో ఉంటారు. అనంతరం రంజాన్ పండగను జరుపుకొంటారు. రంజాన్ మాసం సందర్భంగా జిల్లాలోని మసీ దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 
రోజా (ఉపవాసం) గురించి
రంజాన్ మాసంలో ముస్లింలు తప్పనిసరిగా రోజా (ఉపవాసం) పాటిస్తారు. ఇందులో భా గంగా సూర్యోదయం కంటే ముందు వేకువజామున 3 గంటల నుంచి 5 గంటలలోపు సహర్ పేరిట భోజనాలను పూర్తి చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం వరకు నిష్టగా ఉపవాసం ఉం టారు. ఐదేళ్ల బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అందరూ ఉపవాసం ఉండవచ్చు.

ఈ సమయంలో కనీసం లాలాజలాన్ని సైతం మింగరు. రోజుకు ఐదు సార్లు (ఫజర్, జోహర్, అస ర్, మగ్రిబ్, ఇషా) నమాజులు చదవడంతో పాటు అల్లాహ్‌ను ప్రసన్నం చేసేందుకు ఖురాన్ పఠిస్తారు. అంతేకాకుండా తరావీ పేరిట 26 రోజుల పాటు ఖురాన్‌లోని సూక్తులను కంఠస్తం చేసిన హాఫిజ్ (మత గురువు) ప్రత్యేక నమాజు చదువుతారు. సూర్యాస్తమయం సమయంలో సాయంత్రం మగ్రిబ్ నమాజు కంటే ముందు ఇఫ్తార్‌ను చేసి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్ సందర్భంగా పండ్లు, ఫలహారాలు, ఖర్జూరం అధికంగా తీసుకుంటారు.
 
దీక్షల ప్రత్యేకతలు
ముస్లిం క్యాలెండర్ హిజ్రీ ప్రకారం రంజాన్ మా సానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసం లో దీక్షలు పాటించి, మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసే వారి కోరికలను అల్లాహ్ తీరుస్తాడని ముస్లింలు నమ్ముతారు. ఈ మాసంలోని 30 రోజుల దీక్షలను మూడు భాగాలుగా విభజించి వాటికి ప్రాధాన్యతలను కల్పించారు. మొదటి 10 రోజుల్లో దీక్షలు పాటిస్తే అల్లాహ్ కరుణ వర్షాన్ని కురిపిస్తాడని, 10 నుంచి 20 రోజుల దీక్షలు పాటిస్తే చేసిన పాపాలను హరిస్తాడని, మిగిలిన 10 రోజుల దీక్షలను పూర్తి చేస్తే నరక బాధ తప్పిస్తాడని చెబుతారు.

27వ రోజు రాత్రి షబ్-ఎ-ఖదర్ పేరిట జరి గే ఉత్సవానికి ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ముస్లింలు జకాత్, ఫిత్రా, సద్‌ఖాల పేరుతో తమ సంపాదన, ఆస్తు ల్లో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు. నిరుపేదలు తమతో సమానంగా పండగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో వస్త్రదానం, ఆర్థిక సహాయం చేస్తారు. దానధర్మాలు చేస్తే స్వర్గం లో చోటు లభిస్తుందని ముస్లింల భావన. ఫిత్రా అందజేస్తారు.
 
మత సామరస్యానికి ప్రతీక
రంజాన్ మాసంలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ పాలుపంచుకొంటారు. ముస్లింలకు ఆయా పార్టీల నాయకులు, అధికారు లు, అనధికారులు ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి ప్రోత్సహిస్తారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు.
 
నోరూరించే వంటకాలు
రంజాన్ అనగానే గుర్తుకు వచ్చే వంటకాలు హలీం, హరీస్, ఖుర్బాని కా మీఠా. ఉపవాస దీక్షల్లో ఉన్న వారికి ఈ వంటకాలు వండి వార్చేందుకు  నగరంలోని పలు స్టార్ హోటళ్లతోపాటు గల్లీల్లో సైతం ప్రత్యేకహోటళ్లు సిద్ధమయ్యాయి. వీటితో పాటు కద్దూకీ ఖీర్, దహీవడా వంటి వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రంజాన్ పండుగ రోజు ప్రత్యేకంగా షూర్‌ఖుర్మా వండుతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement