
నాన్న దీక్ష కొనసాగుతుంది: ముద్రగడ బాలు
తన తండ్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షను కొనసాగిస్తారని ఆయన కుమారుడు బాలు మీడియాకు తెలిపారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తన తండ్రి రక్త నమూనాలను పరీక్ష కోసం ఇచ్చారని, ఒక్క సెలైన్ బాటిల్ మాత్రమే ఎక్కించారు తప్ప ఐవీ ఫ్లూయిడ్లు కొనసాగించడం లేదని ఆయన చెప్పారు.
తుని ఘటనపై అరెస్టులు ఆపేయాలని, కేసులపై పునఃసమీక్ష జరగాలని పద్మనాభం డిమాండ్ చేస్తున్నారన్నారు. అరెస్టయిన 13 మందిని బెయిల్ మీద విడుదల చేసి, ముద్రగడతో పాటు అందరినీ కిర్లంపూడికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉందని బాలు తెలిపారు.