లండన్ : అడపాదడపా ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మేలేనంటూ తాజా అథ్యయనం వెల్లడించింది. ఫాస్టింగ్‌తో మెదడు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తేలింది. అవసరమైన కేలరీల కంటే 40 శాతం తక్కువగా కొవ్వు లేని ఆహారం తీసుకున్న ఎలుకల మెదడు కణాల్లో వాపు (ఇన్‌ఫ్లమేషన్) తగ్గినట్టు వెల్లడైంది. ఈ తరహా ఆహారం మెదడు కణజాలం పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధన పేర్కొంది.
పరిమిత కేలరీలతో కూడిన కొవ్వు రహిత ఆహారం ఇచ్చినప్పుడే ఎలుకల్లో వయసు ప్రభావంతో వచ్చే వాపును తగ్గించగలిగామని అథ్యయనానికి నేతృత్వం వహించిన గ్రొనిజెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ బార్ట్ ఈగెన్ చెప్పారు. వ్యాయామం కంటే కేలరీలను తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని ఆయన తెలిపారు. మెదడు కణాల వాపు సోరియాసిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులకు దారితీస్తుంది. వయసురీత్యా వచ్చే అనర్ధాలను తగ్గించుకుని మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెర్రీస్, తాజా కూరగాయలు, నట్స్, చేపలు, సముద్ర ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment