ఫాస్టింగ్లో మోదీ కంటే తక్కువేమి కాదట | On fasting, UP CM Adityanath is no less than PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఫాస్టింగ్లో మోదీ కంటే తక్కువేమి కాదట

Published Wed, Mar 22 2017 12:03 PM | Last Updated on Sat, Aug 25 2018 4:19 PM

ఫాస్టింగ్లో మోదీ కంటే తక్కువేమి కాదట - Sakshi

ఫాస్టింగ్లో మోదీ కంటే తక్కువేమి కాదట

దసరా నవరాత్రులు సందర్భంగా గత 43 ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న దీక్షలకు తక్కువేమీ కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫాస్టింగ్ చేస్తారట.

న్యూఢిల్లీ : దసరా నవరాత్రులు సందర్భంగా గత 43 ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న దీక్షలకు తక్కువేమీ కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫాస్టింగ్ చేస్తారట. వచ్చే వారం ఆదిత్యనాథ్ తొమ్మిది రోజుల ఫాస్ట్ నిర్వహించనున్నారు. మార్చి 28 నుంచి చైత్ర నవరాత్రి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన ఈ దీక్షను చేపడతారని ఆయన  సన్నిహితులు చెబుతున్నారు. ఈ దీక్ష సమయంలో యోగి ఆదిత్యనాథ్ కేవలం బంగాళదుంపలను, పండ్లను మాత్రమే స్వీకరిస్తారని చెప్పారు.
 
దీక్షా సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఎంతో భక్తితో విశేష్ పూజలో పాల్గొంటారని తెలిపారు. సంస్కృత మహావిద్యాలయ స్కాలర్స్ ఈ పూజను నిర్వహిస్తారని యోగి ఆదిత్యనాథ్ కు అతి సన్నిహితుడు చెప్పారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ ఈ పూజ కోసం వచ్చే వారం గోరఖ్ పూర్ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే తొమ్మిది రోజుల దీక్షను చేపడుతున్నారు. అక్టోబర్ లో వచ్చే మరో నవరాత్రులకు గోరఖ్ పూర్ మఠ్ లో వివిధ ప్రార్థనలు, ఏకాగ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. యోగి ఆదిత్యనాథ్ తన గురువు దగ్గర్నుంచి 1984లో ఈ దీక్షను చేపట్టారట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement