బోట్స్వానా : నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా ఏనుగులు చనిపోతుండటంపై విచరణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఈ మేరకు షాకింగ్ విషయాలను వెల్లడించింది. సాధారణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మట్టిలోనూ ఉండే సూక్షజీవి. వీటి వల్ల ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల వల్ల విషతుల్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సూక్ష్మజీవులు విషంగా మారాయని, ఈ నీళ్లు తాగడంతో ఏనుగులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మే నెల ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా 330 ఏనుగులు చనిపోయినట్లు జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సిరిల్ టావోలో పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా జూలై మాసంలోనే 281 ఏనుగులు చనిపోయినట్లు తెలిపారు. (అరుదైన మగ కప్పల భీకర పోరు )
అయితే మిగతా వన్యప్రాణులకు సైతం ఈ పరిస్థితి ముప్పుగా మారుతుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎందుకంటే ఈ టాక్సాన్స్ వల్ల ఇప్పటివరకు ఏనుగులు మాత్రమే చనిపోయాయి. మిగతా జంతువులన్నీ క్షేమంగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏనుగల జనాభా అధికంగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్వానాలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న జింబాబ్వేలోని అతిపెద్ద గేమ్ పార్క్ సమీపంలో సుమారు 25 ఏనుగులు చనిపోయాయి. అయితే బొట్స్వానా ఘటనతో దీన్ని లింక్ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి ఏనుగు మృతదేహాలను పరిశీంచాకే నీటిలోని టాక్సిన్ వల్ల చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇవి మృత్యువాత పడి ఉండొచ్చేమో అని విక్టోరియా ఫాల్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని పశువైద్యుడు క్రిస్ ఫాగ్గిన్ అన్నారు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు)
Comments
Please login to add a commentAdd a comment