
చర్మ సౌందర్యం పెంపొందించడం, ముఖం కాంతివంతంగా మారడానికి ట్రీట్‌మెంట్‌లు అన్నీ బ్యూటీపార్లర్‌లోనే సాధ్యమవుతాయన్న అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్‌లను ఇంట్లోనే చేసుకుంటే కాంతులీనే ముఖం మీ సొంతం.ఎర్రచందనం పేస్ట్‌ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది.ఎర్రచందనం పౌడర్‌లో కొబ్బరి పాలు కలిపి ఆ పేస్ట్ ముఖానికి రాసుకొని పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముఖం కాంతివంత మవుతుంది. వెనిగర్, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి.
కొబ్బరి నీళ్లలో పైనాపిల్ జ్యూస్ కలిపి ముఖానికి, మెడకు రాసుకొని పది నిముషాల తరువాత క్లీన్ చేసుకోవాలి.క్యారట్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిముషాల తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసే నీళ్లలో అర కప్పు తేనె కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment