తక్కువ ధరకే లావా 4జీ స్మార్ట్ ఫోన్ | LAVA launches A97 smartphone with 4G/VoLTE at Rs 5,949 | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకే లావా 4జీ స్మార్ట్ ఫోన్

Published Wed, Sep 28 2016 6:03 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

తక్కువ ధరకే లావా 4జీ స్మార్ట్ ఫోన్ - Sakshi

తక్కువ ధరకే లావా 4జీ స్మార్ట్ ఫోన్

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లావా బుధవారం మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఏ97 పేరుతో వోల్టీ ఎనాబిల్డ్ 4జీ ఫోన్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 12 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. రెండు వైపుల ఉన్న 5 ఎంపీ రియర్ కెమెరా ఎల్ ఈడీ ఫ్లాష్ తో పనిచేస్తుంది. తక్కువ కాంతి ఉన్నప్పటికీ మంచి క్వాలిటీ సెల్ఫీలు తీసుకునే వీలుంది. ఫేస్ బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్ లుగా సేవ చేసుకునే ఫీచర్లు ఉన్నాయి.

5 ఇంచుల డిస్ ప్లే, 1.3 జీహెచ్ జీ క్వాడ్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ కలిగిన ఏ97 స్మార్ట్ ఫోన్ ఇన్ బిల్ట్ మొమరీ 8 జీబీ. దీన్ని 32 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకునే వీలుంది. దీని ధర రూ. 5,949. రిటైల్ అవుట్ లెట్లు, మల్టీ బ్రాండ్ అవుట్ లెట్లలో ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement