చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్‌లో చాలా విషయం ఉందే! | Face Slimming Tool Trainer | Sakshi
Sakshi News home page

చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్‌లో చాలా విషయం ఉందే!

Published Sun, May 29 2022 5:56 PM | Last Updated on Sun, May 29 2022 6:00 PM

 Face Slimming Tool Trainer - Sakshi

 నాజూకుగా ఉండటమే అసలైన అందంగా నిర్వచిస్తున్న కాలం ఇది. అందుకు ప్రయత్నించని అమ్మాయి లేదంటే అంత అతిశయోక్తి కాదేమో! గడ్డం కింద కనిపించే డబుల్‌ చిన్, బూరెల్లాంటి బుగ్గలు, మెడ చుట్టూ పేరుకున్న కొవ్వుని కప్పిపుచ్చడానికి ప్రయాస పడని పిల్ల లేదంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ ప్రయత్న, ప్రయాసలకు చెక్‌ పెడుతుంది ఈ డివైజ్‌. దీన్ని ఠి లైన్‌ ఫేషియల్‌ స్లిమ్మింగ్‌ టూల్‌ అని కూడా అంటారు. ఇది చూడటానికి పుట్టగొడుగులా ఉంటుంది.

 చిత్రంలో చూపించినట్టుగా పెదవుల మధ్య ఉంచి.. గాలిని లోపలికి పీలుస్తూ.. బయటికి వదిలిపెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గడ్డం వంటి భాగాల్లో సరైన వ్యాయామం జరిగి.. అందమైన షేప్‌ వస్తుంది. ఈ టూల్‌ చాలా మన్నికైనది. పునర్వినియోగించదగినది. ఫుడ్‌–గ్రేడ్, హీట్‌–రెసిస్టెంట్‌ సిలికాన్‌ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్‌ను.. ముక్కు, నోరు భాగాలకు  దగ్గరగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి వాసనా ఉండదు. ఎవ్వరైనా వినియోగించొచ్చు.

దవడలు, మెడ, గడ్డం ఇలా మొహంలో పేరుకున్న కొవ్వును ఈ స్లిమ్మర్‌ చాలా చక్కగా కరిగిస్తుంది. ఇందులో రకరకాల సైజులేం ఉండవు. ఒకే సైజ్‌లో లభిస్తుంది. ముఖ కండరాలకు మంచి వ్యాయామాన్నిచ్చి.. వయసుని తగ్గిస్తూ.. ముడతల్ని పోగొడుతుంది. రోజువారి వ్యాయామంలో దీన్ని భాగం చేసుకోవాలి. మూడు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు రోజువారిగా కొంచెం కొంచెం పెంచుకుంటూ 8 వారాల పాటు స్వతహాగా ఈ ట్రీట్మెంట్‌ పొందితే..ముఖం స్లిమ్‌గా మారుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement