ఫేస్‌క్రీమ్స్, లోషన్స్ ముఖానికి అప్లై చేసుకోవడం నిమిషాల పని. అవి అప్లై చేసుకున్నంతసేపే ఆ అందం నిలుస్తుంది. కానీ ఈ చిట్కాలను పాటిస్తే ఆ అందమే శాశ్వతమవుతుంది. కాకపోతే కాస్త సమయాన్ని వెచ్చించాలి. ఖర్చులేని చిట్కాలతో కాంతివంతమైన అందం సొంతమవుతుందంటే... అంతకన్నా ఏం కావాలి? ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి : స్క్రబ్ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, కీరదోశ జ్యూస్ – 2 టీ స్పూన్లు, మాస్క్ : ఖర్జూరం గుజ్జు – 2 టీ స్పూన్లు, శనగపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటి పచ్చిపాలు – 1 టీ స్పూన్
తయారీ : ముందుగా రోజ్‌వాటర్ లేదా కొబ్బరి నూనె రెండు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసుకుని మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, తేనె, కీరదోశ జ్యూస్ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గుజ్జు, శనగపిండి, చిక్కటి పచ్చిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే సబ్బు అప్లై చెయ్యకపోవడమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment