వర్షాకాలం... స్క్రబ్ నాణ్యమైనదిగా ఉండాలి
బ్యూటిప్స్
వర్షాకాలం దుమ్ము కణాలు చర్మం మీద పేరుకుపోయే అవకాశం ఉంది. శుభ్రపరచకపోతే మృతకణాలు పెరిగి చర్మం తన మృదుత్వాన్ని, కాంతిమంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... నాణ్యమైన స్క్రబ్‌ను ఉపయోగించి మృదువుగా చర్మంపై రుద్దాలి. దీని వల్ల స్వేదరంధ్రాల్లో మృతకణాలు తొలగిపోయి, సహజమైన మాయిశ్చరైజర్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం మృదుత్వం దెబ్బతినదు.
వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో చాలామంది సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం ఆపేస్తారు. వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవాలి. వర్షా కాలం హెవీ మేకప్‌కి వెళ్లకపోవడమే మంచిది. అంతగా ఉపయోగించాలనుకుంటే వాటర్‌ప్రూఫ్ మేకప్ మేలు. బ్లీచింగ్, ఫేసియల్స్ ఈ కాలం అంతగా అవసరం ఉండదు. వీటి వల్ల చర్మం గరకుగా తయారవుతుంది.రాత్రిపూట పెదవులకు పాల మీగడ, లేదా కొబ్బరి నూనె వంటివి రాసుకుంటే పగుళ్ల సమస్య బాధించదు. వాక్సింగ్, పెడిక్యూర్, మానిక్యూర్‌లు చేయించుకోవడం వల్ల పాదాలు, చేతుల సంరక్షణ బాగుంటుంది.