రైస్‌ఫ్లోర్ ప్యాక్... | Rice floor Pack of New Face | Sakshi
Sakshi News home page

రైస్‌ఫ్లోర్ ప్యాక్...

Published Sun, May 29 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

రైస్‌ఫ్లోర్ ప్యాక్...

రైస్‌ఫ్లోర్ ప్యాక్...

న్యూ ఫేస్
కావలసినవి: బియ్యంపిండి - 1 టేబుల్ స్పూన్, పెరుగు - 1 టీ స్పూన్, తేనె - 1 టీ స్పూన్
తయారీ: ముందుగా ఓ బౌల్‌లో బియ్య పిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తేనెను కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని ఈ బియ్యం పిండి మిశ్రమంతో ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక, గోరువెచ్చని నీటితో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. దాంతో ముఖం క్లీన్‌గా సాఫ్ట్‌గా మారుతుంది.

* బియ్యంపిండి మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెరుగు, తేనె ముఖకాంతిని మెరుగుపరుస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు కచ్చితంగా వేసుకుంటే మృతకణాలు తొలగిపోయి.. ముఖం తళతళా మెరిసిపోతుంది. కావాలంటే ఈ ప్యాక్‌లో కొద్దిగా శనగపిండిని కూడా కలుపుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement