సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తి, ఫర్నిచర్, వినియోగదారుల ఉత్పత్తుల రంగాల్లో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను పరిశీలించాల్సిందిగా గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంసింగ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరిపింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్రోవెట్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన ఆయిల్ పామ్, పాడి వ్యాపారాన్ని విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
కాగా ఈ కంపెనీ.. మలేసియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సరీ్వసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment