‘పది’ పరీక్షలకు ఫర్నీచర్ కష్టాలు
169 కేంద్రాల్లో కుర్చీలు, బల్లలు కరువు
బల్లలు సమకూర్చాలని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ ఒత్తిడి
పుత్తూరులో సెల్ఫ్ సెంటర్‌పై దుమారం
మాస్ కాపీయింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లు
మంచులా కరుగుతున్న కాలం.. దగ్గర పడుతున్న పరీక్షల గడువు.. మెజారిటీ పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ కరువు.. బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్‌కు విద్యాశాఖ హుకుం. చేస్తే ఎలా.. చేయకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏమిటని లోలోన మధన. వెరసి ఈ సారీ పది విద్యార్థులకు నేల రాతలు తప్పేలా లేదు.
తిరుపతి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పేలాలేవు. మెజార్టీ కేంద్రాల్లో బల్లలు, కుర్చీలు, కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యాలు లేవు. పరీక్ష కేంద్రాల్లో సామగ్రిని ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సమకూర్చాలని ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. దీంతో తమ పాఠశాలలో ఉన్న సామగ్రిని పరీక్ష కేం ద్రాలకు తరలిస్తే, మిగిలిన తరగతుల వి ద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను కింద కూర్చోబెడితే ఫీజులు చెల్లించే తల్లిదండ్రులు ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు రాసేది మీ పిల్లలే కదా.. ఫర్నీచర్ సమకూర్చకపోతే ఎలా అనే విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచా రం. దీంతో జిల్లాలోని 870కి పైగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. బయట ఫర్నీచ ర్ అద్దెకు తెచ్చినా ఆ అద్దె మేమే చెల్లించాల్సి వస్తుందని ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెం ట్లు మధనపడుతున్నారు.
జిల్లాలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 52,539
మొత్తం పరీక్ష కేంద్రాలు: 281
ఫర్నీచర్ పూర్తిగా లేని పాఠశాలలు: 70
పాక్షికంగా లేనివి: 99
మొత్తం: 169
కార్పొరేట్‌కు దాసొహం...
జిల్లాలో ఉన్నతాధికారులు సైతం కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. పుత్తూరులో ఓ కార్పొరేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారులు సెల్ఫ్ సెంటర్ కేటాయించడంపై దుమారం రేగుతోంది. ఆ యాజమాన్యం మరో స్కూల్ రిజిస్ట్రేషన్‌పై నడుస్తుందని, ఇప్పుడు అదే సెల్ఫ్ సెంటర్‌లో పరీక్షలు రాయడం ద్వారా మాస్ కాఫీయింగ్ జరిగే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నా యి. మరో పేరొందిన కార్పొరేట్ పాఠశాల సైతం వారి పిల్లలు పరీక్షలు రాసే సెంటర్లకు చెందిన డిపార్టుమెంట్ ఆఫీసర్లు, చీఫ్‌ల వద్దకు వెళ్లి .. తమ పాఠశాల కు చెందిన పిల్లలకు పూర్తిగా సహకరించకపోతే, ఇబ్బందులు పడతారని సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద పదో తరగతి పరీక్షల్లో ఈ సారి తమ విద్యార్థులను పూర్తి స్థాయిలో గట్టెక్కించి, మంచి మార్కులు సాధించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తాం...
పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలకు బల్లలు సమకూరుస్తామన్నారు. ఫర్నీచర్ కోసం ఎవరిని ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. పుత్తూరులోని ఓ పాఠశాలలో సెల్ఫ్ సెంటర్ ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ పదేళ్లుగా పరీక్ష కేంద్రం ఉందన్నారు. అక్కడికి సీనియర్ ఉపాధ్యాయులరాలిని చీఫ్‌గా నియమించామన్నారు. ఆ సెంటర్‌పై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సారీ నేలబారే!
Published Mon, Mar 14 2016 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement
Advertisement