హైదరాబాద్‌లో గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సేవలు | grab on rent services in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సేవలు

Published Tue, Feb 21 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

హైదరాబాద్‌లో గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సేవలు

హైదరాబాద్‌లో గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సేవలు

అద్దెకు ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు
ఏడాదిలో మరో 4 నగరాలకు విస్తరణ: సీఈఓ శుభం జైన్‌  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ రెంటల్‌ సర్వీసెస్‌ సంస్థ గ్రాబ్‌ఆన్‌రెంట్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు వంటి 9 విభాగాల్లో ఉత్పత్తులను అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలో 400 మంది వెండర్లతో భాగస్వామ్యమయ్యామని గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సీఈఓ శుభం జైన్‌ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఏడాది కాలంలో పుణె, ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.

ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ మీద దృష్టిపెట్టామని.. సిరీస్‌–ఏలో భాగంగా రూ.30 కోట్ల సమీకరణ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పేర్కొన్నారు. పాత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నామని మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్‌ చేస్తామన్నారు. గతంలో ఐవీకాప్, యునికార్న్‌ ఇండియా వెంచర్స్‌ నుంచి ఫండింగ్‌ను పొందామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గ్రాబ్‌ఆన్‌రెంట్‌.. ఇప్పటివరకు 8,500 మంది కస్టమర్లకు సేవలందించింది. ప్రతి నెలా 35 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement