
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన బైకు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నంబర్ ప్లేట్ లేకుండా జూబ్లీహిల్స్ రహదారులపై చక్కర్లు కొడుతున్న రూ.25 లక్షల విలువైన వాహనాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా, నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్‌ను ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి గుర్తించి పట్టుకున్నారు.
సంబంధిత ధ్రువపత్రాలు చూపించమని కోరగా అతని వద్ద లేకపోవడంతో పాటు బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదు. ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న 800 సీసీ ఆస్టానా స్పోర్ట్స్ బైక్‌గా దీన్ని పోలీసులు గుర్తించారు. దీని ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన అనూష్‌రెడ్డికి చెందిన బైక్‌గా దీన్ని గుర్తించిన పోలీసులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొచ్చిన తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
చదవండి: ట్విటర్‌లో పరిచయం.. ఆపై వాట్సాప్.. చివరికి నమ్మకంగా
Comments
Please login to add a commentAdd a comment