హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం | Rain in Hyderabad | Sakshi

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Jun 2 2019 5:29 PM | Updated on Jun 2 2019 7:41 PM

Rain in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది. జూభ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, సికింద్రబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందారు.

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement