Old Video Of Rahul Sipligunj About Drugs Going Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి!

Published Mon, Apr 4 2022 10:51 AM | Last Updated on Mon, Apr 4 2022 4:42 PM

Rahul Sipliganj Ex Inspector Poosapati Sivachandra Both In News - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేవ్‌ పార్టీ జరిగిన ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ అంశంలో బిగ్‌బాస్‌ సీజన్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్, బంజారాహిల్స్‌ తాజా మాజీ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర ఇద్దరూ వార్తల్లో నిలిచారు. వీరిలో ఒకరు ఆ పార్టీలో పాల్గొని పట్టుబడగా... మరొకరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలు ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నషా ముక్త్‌ హైదరాబాద్‌ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిటీ పోలీసులు ‘డ్రగ్‌ ఫ్రీ హైదరాబాద్‌’పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

బోరబండ ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ అతిథిగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని, మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇదే అంశాన్ని తన అధికారిక సోషల్‌మీడియాలోనూ పొందుపరిచారు. ఇక ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర తన ఇంట్లో ‘హాయే మేరా దిల్‌’అనే హిందీ పాటకు డ్యాన్స్‌ చేశారు. షార్ట్స్, టీషర్టులో ఉన్న శివచంద్ర డ్యాన్స్‌ చేసిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. అది కూడా ఆదివారం వైరల్‌గా మారింది.

(చదవండి: పట్టుబడగానే... మావాడు మంచోడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement