సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో ఓ యువతి హల్‌చల్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్‌కు చెందిన యువతి(30) బుధవారం మధ్యాహ్నం భరత్ అనే యువకుడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. దీంతో భరత్ కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యువతి కృష్ణకాంత్ పార్కు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..)
జూబ్లీహిల్స్ పోలీసులు కృష్ణకాంత్ పార్కు వెళ్ళి పరిశీలించగా అంతకు అరగంటముందే ఆమె ఆటోలో వెళ్ళినట్లుగా స్థానికులు చెప్పారు. ఆటో నంబర్ ఆధారంగా పోలీసులు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రహ్మత్‌నగర్‌లో ఆమెను గుర్తించారు. పోలీస్ అవుట్ పోస్ట్‌కు విచారణ కోసం తీసుకురాగా అప్పటికే మత్తులో ఉన్న సదరు యువతి పోలీసులు చూస్తుండగానే ఒంటిమీద దుస్తులు తీసేసి చిందులేసింది. ఇద్దరు మహిళల సాయంతో ఆమెకు సర్దిచెప్పి భరత్‌ను పిలిపించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. (చదవండి: భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య)
Comments
Please login to add a commentAdd a comment