సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి ఆ పబ్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటుపబ్ యజమానులతో సహా 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. డ్రగ్స్ వ్యవహారం పూర్తి వివరాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరుగడంతో ఆమె స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ బార్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ రేణుకా చౌదరి కూతరు తేజస్విని చౌదరిదని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. పుడింగ్ అండ్ మింక్ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన కుమార్తె తేజస్వినిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అసలు డ్రగ్స్ కేసులో తన కూతురిక ప్రమేయం లేదని తెలిపారు.
చదవండి: డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ.. ‘ఆ కోడ్ చెప్తేనే అనుమతి’
Comments
Please login to add a commentAdd a comment