renuka choudary
-
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
రా చూసుకుందాం..హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్
-
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు: తీవ్రంగా స్పందించిన రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి ఆ పబ్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటుపబ్ యజమానులతో సహా 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. డ్రగ్స్ వ్యవహారం పూర్తి వివరాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరుగడంతో ఆమె స్పందించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలో రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ బార్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ రేణుకా చౌదరి కూతరు తేజస్విని చౌదరిదని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. పుడింగ్ అండ్ మింక్ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన కుమార్తె తేజస్వినిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అసలు డ్రగ్స్ కేసులో తన కూతురిక ప్రమేయం లేదని తెలిపారు. చదవండి: డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ.. ‘ఆ కోడ్ చెప్తేనే అనుమతి’ -
నాల్రోజులే ఇక ప్రచారానికి..
సాక్షి, ఖమ్మం : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేస్తూనే.. అటు విద్యార్థి, ఉద్యోగ, సామాజిక సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే పోటీపడే రీతిలో ఆయా సంఘాల వారిని కలుస్తున్నాయి. ఇక ఎన్నికల్లో తమకు కలిసొచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ గురువారం జరిగిన కేసీఆర్ సభ విజయవంతం కావడంతో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సీఎం పిలుపునివ్వడంతో దాని ప్రభావం పార్టీ శ్రేణులపై ఉంటుందనే భావన నామా వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. నామా విజయాన్ని కోరుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిని ఏ రోజుకారోజు అంచనా వేస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులను కలుపుకుపోవడానికి, పార్టీలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడానికి తక్షణమే పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ నేతలు ఒకే వేదికపైకి వస్తున్నా.. మనసులు మాత్రం కలవని పరిస్థితి ఉందని.. దీంతో ఎదురయ్యే ఇబ్బందులను నామా విజయాన్ని కాంక్షిస్తున్న పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నామా విజయం కోసం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న సమన్వయం, పార్టీ వ్యూహాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అభ్యర్థి నామా ఎన్నికల పర్యటన కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొనేలా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయనకు పట్టున్న సత్తుపల్లి నియోజకవర్గంలో సైతం ఎన్నికల ప్రచారానికి హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం మాజీ మంత్రి జలగంను కలిసి.. తన విజయానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఇప్పటికే అభ్యర్థించారు. అయితే గురువారం ఖమ్మంలో జరిగిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు జలగం ప్రసాదరావు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాల్లో ఎవరికి వారే తమదైన రీతిలో కారణాలను విశ్లేషించుకుంటున్నారు. వ్యతిరేకతే ఉపకరిస్తుంది.. ఇక అధికార టీఆర్ఎస్పై గల వ్యతిరేకతే తన విజయానికి ఉపకరిస్తుందని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకాచౌదరి తన ఎన్నికల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని, పేదల బతుకుల్లో మార్పు లేదని విరుచుకుపడుతున్న ఆమె టీఆర్ఎస్లో జరిగిన అంతర్గత పరిణామాలు సైతం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న తీరును సైతం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రేణుకాచౌదరి వర్గీయులు ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే.. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించడంతో ఆ పార్టీలో కొంత ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తారని, ప్రచారం ముగియడానికి ఒకటి, రెండు రోజుల ముందు ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంకగాంధీ నియోజకవర్గ పరిధిలో పర్యటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకట్ విజయాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరిస్తూ.. ప్రజలను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి లోక్‌సభలో గళమెత్తే అవకాశం కల్పించాలని పార్టీ నేతలు బహిరంగ సభల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుదేవరావు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించడం ద్వారా ఎన్నికల ప్రచారం గావిస్తున్నారు. -
‘నన్ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతా’
సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): మీ ఇంటి ఆడబిడ్డగా తనను గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరీ వేడుకున్నారు. సత్తుపల్లి కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ఇచ్చిన హక్కును నేరవేర్చుకోవటం కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేశానికి ప్రధాని అవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు బీజేపీ ప్రభుత్వం గురి చేసిందని అన్నారు. నైతిక విలువలను కోల్పోయిన నామా నాగేశ్వర రావు నేడు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించే విధంగా, నమ్ముకున్న కార్యకర్తలను మోసగించేవిధంగా ప్రవర్తించి నేడు నామా పార్టీ మారారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. దొంగలకు గన్మెన్లను ఇచ్చిన కేసీఆర్, మహిళ అయిన తనకి గన్మెన్లను ఇవ్వలేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. తనను ఎంత రెచ్చగొడితే తాను అంత రెచ్చిపోతానని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. పోలీసు తనిఖీల పేరుతో తనను భయపెట్టలేరని చెప్పారు. -
కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్ సర్కారే
సాక్షి, ఖమ్మం: శాసనసభలో సంపూర్ణ మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇతర పార్టీల శాసనసభ్యులను, నేతలను ఆ పార్టీలో చేర్చుకొని ఏం సాధిస్తారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి గారపాటి రేణుకాచౌదరి ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న నేతలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకోవటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని, జిల్లా ప్రజల గొంతుగా ఉన్న తనను పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు గెలిపించుకొని పార్లమెంట్‌కు పంపిస్తారని పేర్కొన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి మినహా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈసారి తాను విజయం సాధించటం ద్వారా జిల్లా పురోభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తానని, ఆ తర్వాత స్వచ్ఛంద రాజకీయ విరమణ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో విలువలను నిలబెట్టేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న తాను ఉమ్మడి కుటుబంలాగా తాను భావిస్తున్నానన్నారు. పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజల కోసం పని చేస్తానన్నారు. తాను ఎంపీగా చేసిన సమయంలో మత్స్యకారులను ఆదుకోవటంతో పాటు పాలేరు నుంచి పర్ణశాల వరకు వివిధ పర్యాటక ప్రాంతాల ను అభివృద్ధి చేశానన్నారు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన రైతులను బేడీలు వేస్తే తాము అండగా ఉన్నామన్నారు. ఆదివాసీ, గిరిజనులకు ఎంతో మేలు చేశానన్నారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటుకు కృషి చేయటం వలనే ప్రస్తుతం అనేక మంది మిలట్రీ రిక్రూట్మెంట్కు ఎంపికయ్యారన్నారు. దేశవ్యాప్తంగా అనేక చట్టాలు అమలు చేసేందుకు తన వంతుగా కృషి చేశాన న్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయటం తో పాటు ఆర్చెరి, స్పోర్ట్స్, ఇండోర్ స్టేడియం లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేశానన్నారు. గతంలో స్తంభాద్రి ఉత్సవాలు ఒక పండగ వాతావరణంలో జరిగాయని, ఆ తర్వాత వాటిని పట్టించుకున్న వారు లేరన్నారు. తనను క్యాడరే గెలిపించుకుం టుందనే నమ్మకం అధిష్టానంలో ఉందని, అందుకే తనకు టికెట్ కేటాయించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తనకు ప్రభుత్వానికి మధ్యనేనని, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును పట్టించుకోనన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మల్లు రమేష్, మానుకొండ రాధాకిషోర్, నాగండ్ల దీపక్‌చౌదరి, మేళం శ్రీనివాస్‌యాదవ్, ఏకే రామారావు, రాయల శేషగిరిరావు, చోటా బాబా, పగడాల మంజుల, బండి మణి, జావీద్ పాల్గొన్నారు. జిల్లాను ఎంతో అభివృద్ధి చేశా: రేణుకా చౌదరి ఖమ్మంఅర్బన్: తన హయాంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఆదివారం బైపాస్ రోడ్డులోని సప్తపది çఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడం బహుమతి కాదని బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీగా, రాజ్యసభ సభ్యురాలుగా రోడ్డు వంతెనలు, పర్యాటపరంగ, సంక్షేమం అనేక రంగాల్లో నిధు లు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని), మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రామనాథం, నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, గంగాధర్ చౌదరి మాట్లాడారు. సీనియర్ నాయకులు వల్లంకొండ వెంకటరామయ్య, కూరపాటి వెంకటేశ్వర్లు, జట్ల శ్రీనివాస్, జయాకర్, అయితం రామారావు, వివిధ మండలాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేణుక చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.... ప్రెస్ క్లబ్లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా... రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, పుల్లయ్య, శేషు రాం నాయక్, సైదులు నాయక్ మరికొంత మంది గిరిజన మహిళ అని చూడకుండా కులం పేరుతో దూషిస్తూ, చంపుతామని బెదిరించారని కళావతి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
షోకాజ్ లొల్లి
రేణుక వర్గానికి ఎదురుదెబ్బ ఐదుగురికి పీసీసీ షోకాజ్ నోటీసులు రాహుల్ బర్త్‌సర్టిఫికెట్ అడిగిన ఫలితం డీసీసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఖమ్మం: ఇప్పటికే నివురు కప్పిన నిప్పులా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం రేగింది. మరోసారి షోకాజ్ లొల్లి తెరపైకి వచ్చింది. ‘రేణుకాచౌదరి ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు. ఆమెకు జిల్లాలో రాజకీయాలు చేసే అర్హత లేదు’ అని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేణుక వర్గానికి చెందిన నేతలు ‘ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి బర్త్‌సర్టిఫికెట్ ఉందా..?’ అని సంవత్సరం క్రితం విమర్శలు చేశారు. ప్రతిఢఫలంగా జిల్లాకు చెందిన ఐదుగురు నేతలకు పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలి కాలంలో మళ్లీ జిల్లా పార్టీపై పట్టు సాధించినట్టు కనిపిస్తున్న రేణుక వర్గానికి చెందిన ఐదుగురికి పార్టీ నోటీసులివ్వడం ఆ వర్గాన్ని కలవరపరుస్తోంది. తన వర్గానికి చెందిన 17 మంది నేతలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించడంతో పాటు తన వర్గీయుడికి ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించడంలో సఫలీకృతురాలైన రేణుకకు నిజంగా ఇది షాకేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఐదుగురికి షోకాజ్ నోటీసులు ‘రేణుక జిల్లా వ్యక్తి కాదంటే..రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయాలని కోరుతున్న నేతలు ఆయనకు ఖమ్మం జిల్లాలో బర్త్ సర్టిఫికెట్ అడుగుతారా..?’ అని విలేకరుల సమావేశంలో చెప్పిన డీసీసీ జనరల్ సెక్రటరీ దిరిశాల భద్రయ్య, మహిళా కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ, డీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళి, వైరా నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి సూరంపల్లి రామారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీవీ అప్పారావులకు టీపీసీపీ క్రమశిక్షణ మండలి చైర్మన్ కోదండరెడ్డి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడం సరైంది కాదని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు ఈ నోటీసలులిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాతపూర్వకంగా లేదా కమిటీ ముందు ఈనెల 17వ తేదీలోపు హాజరై సమాధానం చెప్పాలని అందులో వెల్లడించారు. రేణుకా వర్గానికి ఎదురు దెబ్బ ఇటు పీసీసీ, అటు ఏఐసీసీలో మార్కు చెల్లుతుందనే ప్రచారం జరుగుతున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి ఈ షోకాజ్లతో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటును తన అనుచరుడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఇప్పించుకోవడంలో విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాతి పరిణామాల్లో ఎదురు దెబ్బ తగిలింది. తన ముఖ్య అనుచరుడైన పులిపాటి వెంకయ్యను డీసీసీ కార్యాలయం నిర్వాహణ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, భట్టి విక్రమార్క అనుచరుడు ఐతం సత్యం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డిలకు కార్యాలయం బాధ్యతలు అప్పగించారు. ఖంగుతిన్న రేణుకాచౌదరి తనకున్న పలుకుబడిని ఉపయోగించి డీసీసీ ఇన్చార్జిల బాధ్యతల్లో తన అనుచరులు వీవీ అప్పారావు, పరుచూరి మురళిని కూడా చేర్పించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అనుచరులు పొన్నం వెంకటేశ్వర్లు నగర కాంగ్రెస్ పగ్గాలు, యర్రం బాలగంగాధర్‌తిలక్, దొడ్డా అశోక్, అయూబ్‌లకు వివిధ పదవులు అప్పగించారు. ఇదిలా ఉండగా మాజీ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పార్టీలో చేర్పించుకోవద్దని రేణుకాచౌదరి పట్టుపట్టినా వినకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పచ్చజెండా ఊపారు. ఈ షాక్నుండి తేరుకోక ముందే ఇప్పుడు తన అనుచరులు ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో రేణుకాచౌదరి వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. -
అనూహ్యంగా తెరపైకి రేణుకా చౌదరి
-
చాలా చూశా.. ఖబడ్దార్!
తనను అడ్డుకునేందుకు యత్నించిన జేఏసీ నేతలపై ఎంపీ రేణుక ఫైర్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి తెలంగాణ సెగ తగిలింది. ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న సవరణను వ్యతిరేకిస్తూ ఓయూ జేఏసీ నేతలు శనివారం ఢిల్లీలో ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ జేఏసీ చైర్మన్కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నేతలు విఠల్, అద్దంకి దయాకర్లతో పాటు బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నేతలు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, ఆలూరి గంగారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వారు మాట్లాడి వెళ్లిన కొద్దిసేపటికి రేణుకా చౌదరి అక్కడకు చేరుకొని వారి ధర్నాలో కూర్చున్నారు. ఆమె ధర్నాకు హాజరైన విషయాన్ని గమనించిన ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల జేఏసీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ‘సీమాంధ్ర తొత్తుల్లారా ఖబడ్దార్’, ‘తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్’ అంటూ ఆమెను అక్కడ చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. దీనికి ఒకింత గట్టిగానే స్పందించిన రేణుక ‘నన్ను అడ్డుకుంటున్న నేతలు ఎప్పుడైనా ఉద్యమం చేశారా? తెలంగాణ కోసం వారు చేసిందేంటి?’ అని ప్రశ్నించారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చూశానన్న రేణుక జేఏసీ నేతల వైపు వేలు చూపిస్తూ, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమయంలో ధర్నాలో పాల్గొన్న ఓయూ జేఏసీ నేతలు పిడమర్తి రవి, రమేశ్, జగన్ తదితరులు రేణుకను అడ్డుకుంటున్న జేఏసీ నేతలపై మండిపడ్డారు. మీరెప్పుడైనా ఉద్యమం చేశారా? అంటూ జేఏసీ నేతలపై తిరగపడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజకీయ జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్ కల్పించుకొని వారిని విడిపించారు. అనంతరం ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక్క గ్రామాన్నీ వదలం: రేణుక ఈ సందర్భంగా రేణుక విలేకరులతో మాట్లాడారు. ‘భద్రాచలం డివిజన్లోని ఒక్క గ్రామాన్నీ వదులుకునేందుకు సిద్ధంగా లేం. భద్రాచలం పరిధిలోని గ్రామాలన్నీ భద్రాద్రి రాముడితో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఆ అనుబంధాన్ని విడదీస్తే ఊరుకోం’ అని అన్నారు. అనంతరం జేఏసీ నేతలు విఠల్, అద్దంకి దయాకర్‌లు మాట్లాడుతూ ‘భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలుపుతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా రేణుక ఎందుకు నోరు మెదపలేదు? తెలంగాణ విద్యార్థులు తిన్నదరక్క చనిపోయారన్న రేణుక, నేడు తెలంగాణకై పోరాడతానంటే ఎవరూ నమ్మరు’ అని అన్నారు.