భాగ్యనగరంలో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది. జూభ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, సికింద్రబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందారు.