మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని.. | Man Committed Suicide in Banjarahills Hyderabad | Sakshi
Sakshi News home page

మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని..

Published Mon, Feb 14 2022 8:07 AM | Last Updated on Mon, Feb 14 2022 8:31 AM

Man Committed Suicide in Banjarahills Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరదలితోకలిసి భార్య చిన్నచూపు చూసిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే సయీద్‌బిన్‌ మాబ్రుక్‌(40) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ నెల 9న భార్య షాహిన్‌ బేగం గొడవ పడి తన చెల్లెలు ఇంటికి వెళ్లింది. దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి తన భార్యను తీసుకురావడానికి సయీద్‌ అక్కడికి వెళ్లిగా భార్యతో పాటు ఆమె చెల్లెలు కించపరిచారు.

అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన సయీద్‌ తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు భార్య, తోడల్లుడు, ఆయన మరదలు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహ్మద్‌ బిన్‌ హమీద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.    

చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement