
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో కుండపోత వాన పడుతోంది. అక్కడక్కడ ఈదురు గాలులు, చిన్నపాటి మెరుపులతో వర్షంపడింది. దాంతో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. అయితే ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment