
టైటిల్‌ను గెలుచుకున్న ఇందూ అగర్వాల్
బంజారాహిల్స్: మిసెస్ ఇండియా తెలంగాణగా నగరానికి చెందిన ఇందూ అగర్వాల్ ఎంపికయ్యారు. మంగళవారం వర్చువల్‌గా ఫైనల్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో నగరానికి చెందిన ఇందూ అగర్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను దక్కించుకుంది. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజేతగా బైశాలి పాండా నిలిచారు. 40నుంచి 60 ఏళ్ల వయసు కేటగిరి అయిన క్లాసిక్‌విభాగంలో తెలంగాణకు చెందిన స్నేహ చౌదరి, ఏపీకి చెందిన పద్మావతి టైటిల్స్ దక్కించుకున్నారు. వీరితో పాటు మలేషియాలో నివాసం ఉంటున్న అలంకృత దండు మిసెస్ తెలంగాణ ఎన్నారై టైటిల్‌ను గెలుచుకున్నారు. నాలుగేళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి వర్చవల్ పద్ధతిలో నిర్వహించినట్లు నిర్వాహకురాలు మమతా త్రివేది తెలిపారు.
చదవండి: (జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..)
Comments
Please login to add a commentAdd a comment