మార్కెట్‌లోకి ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేటర్
తక్కువ శ్రమతో ఎక్కువ పనితనం
అనేక చికిత్సలకూ ఉపయుక్తం
శిక్షకుడి పర్యవేక్షణ తప్పనిసరి
ఉరుకులు, పరుగుల నగరజీవితంలో శరీరానికి శ్రమలేకుండా పోతోంది. దీంతో శరీరంలో భారీగా కొవ్వులు పేరుకుపోతున్నాయి. వీటిని కరిగించేందుకు రకరకాల ఉత్పత్తులూ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఓ వైపు సహజ సిద్ధమైన వ్యాయామ పరికరాలు, రకరకాల ఫుడ్ అండ్ డైట్ ప్లాన్స్, న్యూట్రిషన్ సెంటర్లు, ఫిట్‌నెస్ సెంటర్‌లూ వెలసినా.. వాటిని అనుసరించడానికి తీరిక, ఆరి్థక స్థోమత లేక పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారి కోసమే మార్కెట్‌లోకి ఎలక్రి్టకల్ మజిల్ స్టిమ్యులేటర్స్ వస్తున్నాయి.. వీటిని షార్ట్ కట్‌లో ఏఎమ్‌ఎస్ అంటారు. వీటిని నగరంలోని అనేక జిమ్‌లు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఏఎమ్‌ఎస్ అంటే ఏమిటి? ఇది నిజంగా శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందా? ఇది సురక్షితమేనా? దీని ద్వారా తక్కువ శ్రమతో కండలు తిరిగిన శరీరాన్ని పొందగలదా? మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. – సాక్షి, సిటీబ్యూరో
ఇది సైన్స్.. – ఆధారిత వ్యాయామ పద్ధతి. సాధారణంగా పట్టించుకోని కండరాలను సైతం ఉత్తేజపరిచేందుకు తక్కువ–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ని ఉపయోగించడం ద్వారా పూర్తి స్థాయి శిక్షణా సెషన్‌కు ఇది సమానమైంది. స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న వారు మల్టీ్టపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు వారి చలనశీలతను తిరిగి పొందేందుకు అనేక రకాల వైద్యపరమైన రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు సహాయం చేయడానికి వైద్యులు చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అదే కొద్దిపాటి మార్పు చేర్పులతో ప్రస్తుతం జిమ్స్‌లో చేరింది.
పర్యవేక్షణ తప్పనిసరి..
వినియోగదారులు ఓ మెషీన్‌కు అనుసంధానించిన పూ ర్తి ఎలక్ట్రోడ్‌లను తప్పనిసరిగా ధరించాలి. ఆ మెషీన్ విద్యుత్ తరంగాలను వైర్లు ,ఎలక్ట్రోడ్ల ద్వారా శరీరంలోని కండరాల్లోకి పంపుతుంది. దీని కోసం ప్రత్యేకమైన సూట్‌లు, పొట్టి చేతుల టాప్ షార్ట్‌లు అవసరం అవుతాయి. పూర్తిగా సమర్ధత కలిగిన శిక్షకుడి పర్యవేక్షణలో మాత్రమే ఈ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.
లాభాలూ.. జాగ్రత్తలూ...
గతంలో ఫిజియోథెరపిస్ట్‌ల వద్ద మాత్రమే ఉండే ఈ పరికరాలు ఇప్పుడు వ్యాయామ ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కండర ఉద్దీపనలో సహాయపడే అనేక పోర్టబుల్ పరికరాలు. వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామాల కోసం వేడెక్కడానికి లేదా గాయమైతే పునరావాస దశలో సహాయపడతాయి. ఈ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. వీటితో అదనపు కండరాల పునరుద్ధరణ లభిస్తుంది. కానీ, అధిక వినియోగం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఆరంభంలో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
ఐరోపా నుంచే...
ఫిట్‌నెస్ మార్కెట్‌లో ఎలక్ట్రో కండరాల ప్రేరణ అనే తాజా సాంకేతికత ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందింది. కండరాల సంకోచాలను ప్రేరేపించడానికి వివిధ రకాల విద్యుత్ ప్రవాహాలను ఇది ఉపయోగిస్తుంది. దీని ద్వారా శరీరం అంతటా రక్త ప్రసరణ పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. –సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ రామోనా బ్రాగంజా
హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం..
ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం. హెడీ క్లమ్, ఎలిజబెత్ హర్లీ మడోన్నా వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఇది చెమట పట్టకుండా కండరాలను నిరి్మంచడానికి సులభమైన మార్గం. – ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా
20 నిమిషాల సూట్.. 90 నిమిషాల వర్కవుట్!
‘‘ఫిట్‌నెస్ పరిశ్రమలో ఇదో ఉత్తేజకరమైన మార్పు. దీని సూట్లు ఫిట్‌నెస్ ఔత్సాహికుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సూట్‌లో 20 నిమిషాల పాటు వర్కవుట్ 90 నిమిషాల సాంప్రదాయ వర్కవుట్‌కి సమానం. ఈ ఏఎమ్‌ఎస్ సూట్‌లు సెకనుకు 85 కండరాల సంకోచాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన కండరాల సమూహాల ద్వారా 98% కంటే ఎక్కువ కండరాలను కదిలేలా చేస్తాయి. కండరాల సడలింపు, పునరుద్ధరణ, చలనశీలతను పెంచడం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం, బిగించడం, టోనింగ్ చేయడం, శక్తి స్థాయిలు, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, స్నాయువు, నడుము నొప్పి, దీర్ఘకాలిక కటి నొప్పి, మధుమేహం సంబంధిత నరాలవ్యాధి, పరి«దీయ ధమని వ్యాధి వంటి అనేక సమస్యల చికిత్సలో ఉపయోగించబడుతుంది. – ఫిట్‌నెస్ నిపుణులు, మీనాక్షి మొహంతి
Comments
Please login to add a commentAdd a comment