Marathon Event
-
అక్కడే నిలబడకోయ్.. కాస్త ఉరకవోయ్..
పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అంటారు పెద్దలు. అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ప్రస్తుతం భాగ్యనగరంలో రన్నింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు రావడం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో అనేక రకాల అరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌తో ఒళ్లు కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనలు, ఫిట్నెస్ ట్రైనర్స్ సలహాల మేరకు నగర వాసులు పరుగులు పెడుతున్నారు..ఈ నేపథ్యంలో దీని గురించి పలు ఆసక్తికర అంశాలు... ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోతోంది. బుర్రనిండా ఆలోచనలతో గజిబిజి గందరగోళాల నడుమ ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారు నగరవాసులు. అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య విషయాలపై నగర ప్రజల్లో అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ ట్రెండ్ కాస్తా హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒక్కో సమస్యపై అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ నిర్వహించి పలువురిని భాగస్వాములను చేసుకుంటున్నాయి.సమస్యలపై అవగాహన కలి్పస్తూ.. యువతలో ప్రస్తుతం అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి వాటిపై అవగాహన లేక వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు నగరంలో తీవ్రతరం అవుతున్నాయి. మత్తుకు బానిసలవుతూ యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. సిగరెట్, గుట్కాలు తింటూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఇలాంటి సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకోసమే పలు ఆస్పత్రులు, సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.సాఫ్ట్వేర్ కంపెనీల్లో.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నైట్ డ్యూటీలు, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి తగ్గించేందుకు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు మారథాన్ నిర్వహిస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు తోటి ఉద్యోగులతో సరదాగా ఉంటూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. వ్యాధులపై ప్రచారానికి.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు జీవన శైలి వ్యాధులపై అవగాహన కలి ్పంచేందుకుకు నగరంలోని చాలా ఆస్పత్రులు మారథాన్ నిర్వహిస్తున్నాయి. మారథాన్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నాయి. ఇదే దారిలో చాలా సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ చారిటీ చేస్తున్నాయి. దీంతో రెండు రకాలుగా మారథాన్ ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు కూడా అప్పుడప్పుడూ మారథాన్ నిర్వహిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. డ్రగ్స్‌పై అవగాహన కలి ్పంచేందుకు ఇటీవల తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. దీనిద్వారా కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు కాళాశాలలు మారథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు పలు అంశాల గురించి వివరిస్తున్నారు.రన్నింగ్‌తో ఎన్నో లాభాలు రన్నింగ్ చేస్తే శారీరక, మానసిక లాభాలు ఎన్నో ఉన్నాయి. 2010లో ఆర్మీలో చేరాను. పుణేలో ఉన్నప్పుడు మా కోచ్ సలహాతో మారథాన్‌లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. 2013 నుంచి మారథాన్‌లో పాల్గొంటూ వస్తున్నా. దేశ, విదేశాల్లో ఎక్కడ మారథాన్ జరిగినా వెళ్లి పాల్గొంటా. ఇటీవల ముంబైలో జరిగిన మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించా. ఢిల్లీలో జరిగిన మారథాన్‌లో సిల్వర్ పతకం వచి్చంది. రేపు జరగబోయే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చాను. మారథాన్‌లో పాల్గొనేందుకు రోజూ కనీసం 30 కిమీ చొప్పున వారానికి 160– 180 కిమీ పరుగెడుతూ సాధన చేస్తుంటాను. రన్నింగ్‌తో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. – శ్రీను బుగత, బంగారంపేట, విజయనగరంఎన్నో పాఠాలు నేరి్పస్తుంది.. మారథాన్ అనేది పరుగు మాత్రమే కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాలు తెలుస్తాయి. సవాళ్లను స్వీకరించడం ఎలాగో తెలియజేస్తుంది. నలుగురితో కలిసి జీవిస్తే వచ్చే ప్రయోజనాలను గురించి నేరి్పస్తుంది. భారత్‌లో గత పది, పదిహేనేళ్ల నుంచి మారథాన్ ట్రెండ్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల్లో కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీన్నొక సామాజిక పండుగలా సంబరంగా జరుపుకొంటున్నారు. – రాజేశ్ వెచ్చా, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఫౌండర్ అద్భుతమైన అనుభూతి.. మారథాన్‌లో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి ఉంటుంది. తోటి ఉద్యోగులతో మారథాన్‌లో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పటివరకూ దాదాపు 10 మారథాన్లలో పాల్గొన్నాను. రన్నింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ కూడా వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది. – మహేశ్‌రెడ్డి మోదుగు, ఐటీ ఉద్యోగి -
విశాఖ సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ 2023 (ఫోటోలు)
-
చైనా మారథాన్‌లో పెను విషాదం
బీజింగ్: చైనాలో శనివారం జరిగిన మారథాన్ పెను విషాదన్ని మిగిల్చింది. ఉత్సాహంగా పరుగు పెట్టేందుకు వచ్చిన వారిలో ఏకంగా 21 మంది ఆల్ట్రా మారథాన్ రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. గాన్జు ప్రావిన్సులోని యెల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ కొండప్రాంతంలో నిర్వహించిన 100 కి.మీ. క్రాస్ కంట్రీ మౌంటెన్ మారథాన్‌లో ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా మిన్నువిరిగి మీద పడినంత పని చేసింది. నిమిషాల వ్యవధిలోనే భీకర వేగంతో గాలివాన సృష్టించిన బీభత్సంలో 21 మంది అథ్లెట్లు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇందులో 172 మంది పాల్గొన్నారు. 8 మంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీభత్సం తాలుకూ సమాచారం తెలియగానే 1200 మంది రెస్క్యూ టీమ్ కొన్ని గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి 151 మంది అథ్లెట్లను సురక్షిత ప్రదేశానికి తరలించింది. -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 10కె, 5కె రన్ ఫోటోలు..
-
ఖండాంతర పరుగులు
అంతులేని ఆత్మవిశ్వాసం..మొక్కవోని అకుంఠిత దీక్ష .. సమాజానికి కొంతైనా సాయపడాలన్న ఉన్నత లక్ష్యం.. అతన్ని సాహసం వైపు పరుగులు పెట్టించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఖండాలలో మారథాన్ పూర్తిచేసి అరుదైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యే కాంటినెంటల్ క్లబ్లో తెలుగువారి ఖ్యాతిని నమోదు చేశాడు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన ఆయనే అనంతపురం జిల్లాకు చెందిన కేతు శ్రీపతిరెడ్డి. సరదాగా ప్రారంభమైన మారథాన్‌ను సమాజ శ్రేయస్సు కోసం మార్చుకున్న శ్రీపతి రెడ్డి స్పూర్తిదాయక విజయ గాథలపై కథనం. బాల్యంలోనే విజ్ఞానానికి అడుగులు అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ కేతు బుచ్చిరెడ్డి కుమారుడైన శ్రీపతిరెడ్డి మెడిసిన్ చదివాడు. తనకున్న విజ్ఞాన ప్రతిభతో వెస్ట్ఇండీస్కు వెళ్లి కొంత కాలం పనిచేశారు. 1995లో గాస్ట్రో ఇంట్రాలజీ ట్రై నింగ్ చేసి భార్య శిరీష కూడా డాక్టర్ కావడంతో గత 24 ఏళ్లుగా అమెరికాలోనే వైద్య సేవలందిస్తున్నారు. ఇది క్లుప్తంగా ఆయన జీవితమైనా ప్రపంచానికి అతన్ని పరిచయం చేసింది, తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసింది మాత్రం మారథాన్ రన్నర్‌గానే. కుటుంబ సభ్యులతో శ్రీపతిరెడ్డి మారథాన్ ఎందుకు ? మారథాన్ అంటే 26.2 మైళ్లు (దాదాపు 42 కిలోమీటర్లు) పరిగెత్తడం. బిజీగా ఉన్న లైఫ్‌లో పరుగులు పెట్టడం దేనికని అందరిలా ఆలోచించకుండా శ్రీపతిరెడ్డి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా డాక్టర్లు బిజీగా ఉంటూ ఎన్నో ఆరోగ్య రహస్యాలు తెలిసినప్పటికీ పాటించడానికి తగిన సమయం దొరకక అనారోగ్యాన్ని అందరిలానే కొనితెచ్చుకుంటుంటారు. అలా కాకుండా డాక్టర్లకు స్ఫూర్తినింపడానికి మాత్రమే మారథాన్ ప్రారంభించిన ఆయన త్వరలోనే కొత్త లక్ష్యాన్ని పెట్టుకుని పరుగులు పెట్టడం నేర్చుకున్నారు. అదే కాన్సర్ పేషంట్ల సహాయనిధికి తోడుగా నిలవడం. మారథాన్ చేయడం ద్వారా నిధులను సేకరించి సహాయనిధికి ఇవ్వడం కోసం ఆయన దాదాపు ఏడు ఖండాలలో మారథాన్ చేశారు. ఎముకలు కొరికే చలిలో సైతం 2016లో డెల్లాస్ (అమెరికా)లో మారథాన్‌ను ప్రారంభించారు. అన్ని ఖండాలలోనూ ఇదే తరహా మారథాన్‌ను నిర్వహించి అక్కడి వారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలన్న ఆలోచనతో ఆయన చాలెంజింగ్ పరిస్థితుల్లో పరుగులు పెట్టారు. మేజర్ మారథాన్ 2017లో బెర్లిన్ (యూరప్) నగరంలో జరిగింది. అక్కడ వివిధ ఖండాల నుండి విచ్చేసే స్పోర్ట్స్మెన్తో కలిసి చేసిన పరుగులు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అదే సంవత్సరం మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లో జరిగిన మారథాన్‌లో పాల్గొన్నారు. అలాగే 2018లో కౌలాలంపూర్ (ఆసియా)లో మారథాన్ సాగింది. ఇక అన్నింటికన్నా 2019 జనవరిలో అంటార్కిటికాలో జరిగిన మారథాన్ అతన్ని నిజంగానే విజేతను చేసింది. ఎముకలు కొరికే చలిలో మైనస్ డిగ్రీల వాతావరణంలో, శ్వాస పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్ధితుల్లో 62మంది విదేశీయులతో కలిసి చేసిన మారథాన్ శ్రీపతిరెడ్డిని విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. ఇలా అన్ని ఖండాలలోనూ మారథాన్ నిర్వహించిన భారతీయుల్లో ఇద్దరు మాత్రమే ఉంటే, డాక్టర్లలో ఆయన మాత్రమే ఆ స్థానాన్ని పొందిన మొదటి వ్యక్తిగా పేరుగాంచారు. లక్ష్యం పెద్దదయి, అందుకు తగిన శ్రమతోడైతే సాధ్యం కానిదేముంటుందని నిరూపించిన ఆయన అనుభవాలు యువతలో కొత్త స్పూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు.– గుంటి మురళీ కృష్ణ,సాక్షి కల్చరల్ రిపోర్టర్, అనంతపురం లక్ష్యంగా ఉన్నతంగా ఉండాలి జీవితమన్న తర్వాత సారవంతంగా ఉండేట్టు చూసుకోవడం మనందరి కర్తవ్యం. యువతలో ఎంతో శక్తి తెలివితేటలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వారికేకాదు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అందుకు తగ్గ శ్రమ తోడైతే విజయాలు అవంతటవే వచ్చి వరిస్తాయి. దాని వెనకే డబ్బు, కీర్తి వచ్చేస్తాయి. ప్రారంభంలోనే ఏదో ఆశించి చేయడం మంచిది కాదనేది పరాజితుల నుండి నేర్చుకోవాలి. సరదాగా ప్రారంభమైన నా రన్నింగ్ చికాగోలోని కాన్సర్ సహాయనిధి వైపు పరుగులు పెడుతోంది. సేవా కార్యక్రమాలలో ఎంతో సంతృప్తి దాగుంటుంది. దానిని ఆస్వాదించే అలవాటు నేర్చుకోవాలి.– డాక్టర్ కేతు శ్రీపతిరెడ్డి,మారథాన్ విన్నర్ -
గిన్నిస్ రికార్డు సాధిస్తాం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో 42 కిలోమీటర్ల మారథాన్ శనివారం నిర్వహిస్తామని సొసైటీ కార్యదర్శి కల్నల్ వి. రాములు తెలిపారు. మారథాన్ గుంటూరు జిల్లా చుండూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై భట్టిప్రోలులోని బుద్ధ స్థూపం వద్ద ముగుస్తుందన్నారు. మారథాన్‌లో గురుకులాలకు చెందిన 150 మంది బాలికలు పాల్గొంటారని చెప్పారు. గతంలో 42 కిమీ మారథాన్ 3.09 గంటల్లో పూర్తిచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారన్నారు. ఆ రికార్డును అ«ధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అలాగే మరో రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సంఘం శరణం గచ్ఛామీ పేరుతో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటికను శనివారం సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 230 పాఠశాలల్లో ప్రదర్శించనున్నన్నామని చెప్పారు. ఒక నాటికను ఏకకాలంలో 230 పాఠశాలల్లో ప్రదర్శించడం ఇదే ప్రథమమన్నారు. తద్వారా కచ్చితంగా గిన్నీస్ రికార్డు నెలకొల్పుతామన్నారు. అదే విధంగా గురుకులాలకు చెందిన 22 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు చైనాకు ఆదివారం పయనమవుతున్నారన్నారు. గతంలో అనేక గిన్నిస్ రికార్డులు సృష్టించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల విద్యాలయాల విద్యార్థులకు ఉందని వివరించారు. సమావేశంలో సొసైటీ డెప్యూటీ సెక్రటరీ ప్రతిభాభారతి పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా చేస్తా
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా చేస్తానని అందుకు సహకరించాలని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిని ప్రపంచంలో మొదటి ఐదు అద్భుత నగరాల్లో ఒకటిగా నిలుపుతామని చెప్పారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మూడో అమరావతి మారథాన్–2018 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, ప్రజలు రోజుకు ఒక గంట చొప్పు వ్యాయామం చేయాలన్నారు. నాకోసం కాకుండా...మీకోసం క్రీడల్లో పాల్గొని జీవితం ఆనందమయం చేసుకోవాలన్నారు. 21కే రన్లో పాల్గొన్న గుంటూరు జిల్లా పూర్వ కలెక్టర్ కాంతీలాల్ దండేను ప్రత్యేకంగా అభినందించారు. రన్లో 7500 మంది పాల్గొన్నట్లు సీఎం ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లు పాల్గొనడం శుభపరిణామమన్నారు. హైదరాబాద్‌లో తానే 20 ఏళ్ల క్రితం 10కే రన్‌ను నిర్వహించానని గుర్తు చేశారు. మారథాన్‌కు అమరావతిలో ఓ వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సుందర ప్రదేశాలు ఎక్కడా లేవని, వాటిని ఉపయోగించుకొని స్పోర్ట్స్, సీఆర్డీఏ, టూరిజం శాఖలును కలుపుతూ స్పోర్ట్స్ క్యాలెండ్ ఇయర్ రూపొందించి ప్రతి గ్రామంలో క్రీడా కార్యక్రమాలు చేపడతామన్నారు. విజేతలు: 21కే, 10కే, 5కే రన్లో గెలుపొందిన వారికి రూ.20 లక్షల ప్రైజ్ మనీని సీఎం అందజేశారు. 10కే రన్ పురుషుల విభాగంలో విజయకుమార్, రమేష్, జయదేవ్, మహిళల విభాగంలో సౌజన్య, ప్రియదర్శిని, శివానీ, కీర్తిక, 21కే రన్ పురుషుల విభాగంలో లింగన్న, వెంకటేశ్వరరావు, బాబూ రావు, మహేంద్ర, మహిళల విభాగంలో ఉషా రాణి, 21కే రన్ సీనియర్ పురుషుల విభాగంలో మహ్మద్, శ్రీనివాసరెడ్డి, సునీల్, శ్రీకాంత్, 10కే రన్ సీనియర్ పురుషుల విభాగంలో పార్థసారధి, బాబూరావు, ఈశ్వరరావు, సూర్యాలకు సీఎం నగదు చెక్కులు, జియో ఫోన్లు అందజేశారు. ప్రారంభ కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పంచుమర్తి అనురాధ, ఎంపీ కేశినేని నాని, చెస్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, మునిసిపల్ కమిషనర్ జె.నివాస్, శాప్ ఎండీ ఎన్.బంగారురాజు పాల్గొన్నారు. రన్ తక్కువ.... రాబడి ఎక్కువ విజయవాడ స్పోర్ట్స్: అమరావతి మారథాన్‌లో పాల్గొనేవారి సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గింది. రన్లో పాల్గొన్న వారంతా సీఎం సమావేశ సమయానికి వెళ్లిపోవడం... తరలించిన విద్యార్థులు మా త్రమే స్టేడియంలో మిగిలి ఉండడం ఈ ఏడాదీ జరిగింది. మారథాన్ తొలిసారిగా నిర్వహించినప్పుడు... వచ్చే సొమ్ముతో అమరావతి రాజధాని నిర్మాణానికి బ్రిక్స్ (ఇటుకలు) కొంటామని అప్పటి కలెక్టర్ బాబు.ఏ ప్రకటించారు. ఇప్పటికి ఎన్ని ఇటుకలు కొన్నారో నిర్వాహకులు, అధి కారులకే తెలియాలి. నిర్వాహకులు మాత్రం రన్లో పాల్గొన్నవారికి మాత్రమే మంచినీరు, ఆహార పదార్థాలు ఇచ్చారుకానీ, తరలించిన విద్యార్థులకు మంచినీరు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందికి గురయ్యారు. తనకు పెన్షన్, ఇల్లు కేటాయించాలంటూ విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ చంద్రబాబు ప్రసంగం మధ్యలో కలకలం సృష్టించింది. పంచుమర్తి అనురాధ నచ్చజెప్పినా ఆమె శాంతించలేదు. ఆమెను సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
‘సేవేధాన్’ డిజిటల్ పార్టనర్ జియో
సాక్షి, హైదరాబాద్: నీటి సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో హెచ్డీఎఫ్సి బ్యాంకు ‘సేవ్ఎధాన్’ పేరుతో ఒక మారధాన్ ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 10 న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్న ఈ సేవేధాన్ కు ‘జియో’ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరించనుంది. సందర్భంగా సేవేధాన్ మెడల్స్, టీ షర్టు లను లాంఛనంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సినిహేరో సాయి ధరంతేజ్, జియో తెలంగాణా సేల్స్ హెడ్ బాలాజీ బాబు, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు హెడ్ మధుసూదన్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు. ప్రతి డ్రాప్ విలువైనది. ప్రతి అడుగు చిరస్మరణీయమైనది. మార్పులో భాగం కండి.. రన్‌ఫర్ ఛేంజ్ .. నీటి వనరులను కాపాడడంలో మాతో కలిసి ప్రతిజ్ఞ చేయండి అంటూ హెచ్డీఎఫ్సీ పిలుపునిస్తోంది. వేదిక: నెక్లెస్ రోడ్, హైదరాబాద్ తేదీ: 10 డిసెంబరు, 2017 సమయం: ఉదయం 6గంటలకు -
10కే రన్
3.. 2.. 1.. గో..! గుంపులో తడబడుతూ పడే అడుగులు.. ఆపై త్వరపడతాయి. పది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. ఏటా భాగ్యనగరాన్ని పలకరిస్తున్న 10కే రన్ అంటే సిటీ రన్నర్లకు ఫుల్ క్రేజ్. ఈ మారథాన్‌లో రేస్‌గుర్రాల్లా పరిగెత్తడానికి సిటీవాసులు పగ్గాలు తెంచుకుని సిద్ధంగా ఉంటారు. బహుదూరం సాగే ఈ పరుగు పందెం టీనేజ్ కుర్రాళ్లకు ఆటవిడుపు.. ఓల్డేజ్ పెద్దలకు మధురానుభూతి. అందుకే మారథాన్ ఈవెంట్ అనగానే మారుమాట్లాడకుండా అందరూ సై అంటారు. ఈ రోజు 10కే రన్ సందర్భంగా ఇందులో పరుగులు తీయనున్న వారిని సాక్షి సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా హీరో నవదీప్ పలకరించారు. స్టార్ రిపోర్టర్ నవదీప్ నవదీప్: హాయ్.. ఎలా ఉన్నారు. అందరూ టికెట్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నట్టున్నారు. యా... వి ఆర్ ఫైన్. నవదీప్: యస్.. ఇది మన హైదరాబాద్‌లో 12వ 10కే రన్. ఈ పన్నెండేళ్లలో 10కే రన్ సాధించిన ఘనత గురించి చెప్పండి? డాక్టర్ శిల్పా: ఇట్స్ ఏ గ్రేట్ ఎచీవ్మెంట్. ఏటా నవంబర్ వచ్చిందంటే.. పరుగు ప్రేమికులంతా రోడ్డెక్కేస్తారు. ఈవెంట్‌కు చాలా రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌లో మునిగిపోతుంటారు. నగరవాసుల జీవన విధానంపై 10కే రన్ ఎఫెక్ట్ చాలానే ఉంది. నేను పదేళ్లుగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈసారి కూడా ట్రాక్‌పై సక్సెస్‌ఫుల్‌గా పరుగెత్తడానికి కసరత్తు చేస్తున్నాను. నవదీప్: గుడ్.. నేను కూడా రెండు మూడు మారథాన్లలో పాల్గొన్నాను. కానీ 10కే రన్‌కు ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్. ఇందులో పాల్గొనేవారంతా చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తారని విన్నాను. నిజమేనా..? సుధ: యస్. కొందరైతే ఆరు నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తుంటారు. 10కే రన్ ఫౌండేషన్ సూచనల మేరకు రోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. డైట్ కూడా చక్కగా మెయింటేన్ చేస్తారు. రన్లో పాల్గొనడానికి ఆరోగ్య సూత్రాలు ఫాలో అవుతారు. నవదీప్: అప్పటికప్పుడు చేరే కొత్తవాళ్లు కూడా చాలామంది ఉంటారు కదా! సుధ: రెగ్యులర్‌గా వచ్చేవాళ్ల కంటే.. ఫ్రెషర్సే ఎక్కువ మంది. అలాంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొన్ని రోజుల ముందు నుంచైనా ప్రాక్టీస్ చేయాలి. రన్ రోజే రంగంలోకి దిగితే.. కండరాలు పట్టేయడం, కాళ్లకు బొబ్బలు రావడం వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కొద్ది దూరం వెళ్లగానే నీరసం వచ్చేస్తుంది. మురళి: ఇదొక గొప్ప వేడుకండి. ఈసారి 15 వేల మంది వరకూ పాల్గొంటున్నారు. హైదరాబాదీలే కాదు. దేశ, విదేశాల నుంచి రన్నర్స్ వస్తారు. ఒకే చోట ఇంత మంది రన్నర్స్‌ను చూడటానికి మించిన స్పెషల్ ఏముంటుంది. కొత్తవారికి ఫస్ట్‌టైం కాస్త ఇబ్బందైనా.. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చే ఏడాది ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతారు. నవదీప్: ఎగ్జాక్ట్లీ.. కొంత ఫ్రెండ్స్ దొరుకుతారు. బోలెడన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. అభిప్రాయాలు కలిస్తే సొసైటీకి పనికొచ్చే పనులు చాలా చేయొచ్చు. శ్యామ్: అఫ్కోర్స్.. ఇప్పటికే చాలా చేస్తున్నారు. మన హైదరాబాద్ 10కే రన్నర్స్ క్లబ్లో మూడువేలకు పైగా సభ్యులున్నారు. వీరంతా గ్రూపులుగా తయారై సామాజిక సేవా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. నవదీప్: సుధగారూ! మీరు ఇప్పటివరకూ ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారు? సుధ: నేను 2011లో మొదటిసారి 10కే రన్లో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు 60 ఏళ్లు పైబడిన ఆడవారు పరిగెత్తడం చూశాను. అంత పెద్దావిడ పరుగెడుతుంటే.. నేనేంటి ఈ పని చేస్తున్నానని ప్రశ్నించుకున్నాను. నిజానికి నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయినా పట్టుదలతో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్నాను. నేను ఇప్పటి వరకు 24 మారథాన్లు పూర్తిచేశాను. సుప్రియ: అదొక ప్రయోజనమైతే.. ఈ క్లబ్స్ ద్వారా రాష్ట్రాలు, దేశాలు దాటి పరుగులు తీసే అవకాశాలు కలుగుతాయి. నేను పూర్వం ఇక్కడ జరిగే మారథాన్స్లోనే పాల్గొనేదాన్ని. ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరులో జరిగే మారథాన్ ఈవెంట్స్‌లో కూడా పాల్గొంటున్నాను. సుధ: డెఫినెట్లీ.. ఎంత చదువుకున్నా.. ఏ స్థాయి ఉద్యోగాలైనా అన్ని ప్రాంతాలు తిరిగే అవకాశం రాకపోవచ్చు. ఈ రన్నింగ్ క్లబ్‌తో స్నేహం కుదిరితే మనకు తెలియకుండానే ఎందరినో కలవొచ్చు.. కొత్త ప్రాంతాలకు వెళ్లొచ్చు. గొప్ప ఎక్స్పీరియన్స్. నవదీప్: ఓ.. గుడ్.. స్పోర్ట్స్‌ని ఇష్టపడే వారికి కూడా ఇది చాలా ఉపయోగకరం కదా! శర్వాణి: చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మెడల్స్, సర్టిఫికెట్స్ ఉంటాయి సర్. నవదీప్: అవునా... మురళి: అవునండీ. ఎవరిపాటికి వారు పరుగెత్తుకుంటూ వెళ్లిపోవడానికి ఇంత హడావుడి ఎందుకుంటుంది? నిర్ణీత సమయంలో గమ్యం చేరుకున్నవారికి రూ.1.75 లక్షల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ అందజేస్తారు. ఏజ్ గ్రూప్స్‌ను బట్టి విజేతలను ఎంపిక చేస్తారు. ఈసారి బహుమతుల కోసమే రూ.35 లక్షలు వెచ్చిస్తున్నారు. నవదీప్: పరుగు పందెం నియమాల సంగతేంటి? మురళి: ముందుగా టికెట్ కొనుక్కోవాలి. దానితోపాటు ఒక నంబర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ క్లాక్ ఒకటి ఇస్తారు. రన్నింగ్ సమయంలో రోడ్డుపై వారు పెట్టిన ఎలక్ట్రానిక్ మ్యాట్‌కి వెళ్లాక అందులో టైమ్ కౌంట్ మొదలవుతుంది. ఎంత సమయానికి ఎంత దూరం పరుగెత్తామో ఆ ఎలక్ట్రానిక్ క్లాక్ సాయంతో మా టెక్నికల్ టీమ్‌కు తెలిసిపోతుంది. నవదీప్: సో.. ఎక్కడా చీట్ చేయడానికి అవకాశం లేదన్నమాట. దేవయాని: నో వే. అయినా అంత చీట్ చేసి గెలవాల్సిన గేమ్ కాదు కదండి. కేవలం సెల్ఫ్ సాటిస్ఫ్యాక్షన్ కోసం చేసే పని. సుప్రియ: ఓ నలుగురు కొత్త వ్యక్తులు కలిస్తేనే బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. అలాంటిది ఇన్ని వేలమంది ఒక్కచోట కలిసి మన హైదరాబాద్రోడ్లపై హాయిగా పరుగెడుతుంటే వచ్చే ఆనందం ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే మాత్రం దొరుకుతుంది చెప్పండి. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. నవదీప్: అదొక్కటే కాదు..సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలపైనా రన్నింగ్ క్లబ్‌లు స్పందిస్తున్నాయి. దానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. మురళి: ష్యూర్. నవదీప్: ఓకే ఫ్రెండ్స్.. ఇలా సాక్షి తర ఫున రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించే అవకాశం దొరికినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. బై...