హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
కాకినాడ: హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అభ్యర్థుల దరఖాస్తులు పెరగటం వల్లే ఇంటర్వ్యూ తేదీలను వాయిదా వేసినట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. కాగా విజయవాడలో శని,ఆదివారాల్లో జరగాల్సిన సీఐడీ హోంగార్డు ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అభ్యర్థులు ఆందోళనకు దిగి నిరసన తెలిపారు.