ఏపీ ఆప్కాబ్‌లో మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు | AP Social Welfare, APCOB Recruitment 2021: Vacancies, Eligibility, Selection Criteria | Sakshi
Sakshi News home page

ఏపీ ఆప్కాబ్‌లో మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

Published Mon, Jul 26 2021 3:25 PM | Last Updated on Mon, Jul 26 2021 3:32 PM

AP Social Welfare, APCOB Recruitment 2021: Vacancies, Eligibility, Selection Criteria - Sakshi

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆప్కాబ్‌).. ఐబీపీఎస్‌ ద్వారా మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 61
► పోస్టుల వివరాలు: మేనేజర్‌(స్కేల్‌1)–26, స్టాఫ్‌ అసిస్టెంట్లు–35.

► మేనేజర్‌(స్కేల్‌1): స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్‌. అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

► స్టాఫ్‌ అసిస్టెంట్లు: అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021

► ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది: 2021 సెప్టెంబర్‌ మొదటి వారం

► వెబ్‌సైట్‌: https://www.apcob.org


ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో 46 బ్యాక్‌లాగ్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కి చెందిన సెక్రటరీ కార్యాలయం.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 46

► పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌–01(ఎస్సీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ)–38(ఎస్సీ–17, ఎస్టీ–21), కేర్‌ టేకర్‌/వార్డెన్‌(ఎస్సీ–04, ఎస్టీ–03)

► ఎంపిక విధానం: ఎలాంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021

► వెబ్‌సైట్‌: www.jnanabhumi.ap.gov.in

డీఎంహెచ్‌వో, అనంతపురంలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 09

► అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు 01.07.2021 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఏపీ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో శాశ్వత ప్రాతిపదికన రిజిస్టర్‌ అయి ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు. 

► వేతనం: నెలకు రూ.53,495 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వివిధ ప్రాంతాల్లో చేసిన పని ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

► వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement