APCOB
-
ఆప్కాబ్ సేవలపై సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు
-
ఆప్కాబ్ లోగోను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్ఆర్
-
Live: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలు
-
అప్పుడు విప్లవంలా ఒక మార్పు జరిగింది... ఆప్కాబ్ వజ్రోత్సవాల్లో సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు. ఆప్కాబ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది. ఆప్కాబ్ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిది. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ చేరువైంది. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్సార్. సహకార వ్యవస్థను వైఎస్సార్ బలోపేతం చేశారు’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సహకార రంగ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. రాష్ట్ర కోపరేటివ్ చరిత్రలో అంటే సహకార రంగ చరిత్రలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. కారణం ఈ రోజు ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటుంది. రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ.. బ్యాంకింగ్ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కాబ్ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి.. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు ఈ 60 సంవత్సరాల ప్రయాణం.. ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే... చాలా గొప్పగా నిలబడింది అని చెప్పుకునే స్ధాయిలో ఆప్కాబ్ ఉంది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, బ్యాంకును సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనందరికి తెలిసిన ఒక నానుడి కూడా చెప్పాలి. భారతరైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే తాను చనిపోతాడనే నానుడి ఒకప్పుడు ఉండేది. కారణం ఏమిటంటే.. విత్తనం నుంచి పంట కోత వరకూ అన్నింటిలోనూ రైతులకు పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి అవసరం అయినప్పుడు దానికోసం రైతన్నలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్ధలు పడుతున్న పరిస్థితులు వల్ల ఈ నానుడి వచ్చింది. విప్లవం లాంటి మార్పు... అప్పుడు విప్లవంలా ఒక మార్పు జరిగింది. అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్ధ అడుగులు వేసిందో అప్పుడే.. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతులు నిలబడగలిగే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రంలో మన బ్యాంకు, రైతుల బ్యాంకు అయిన ఆప్కాబ్ అనే కోపరేటివ్ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రాతక అవసరం అయిన సందర్భంలో ఈ బ్యాంకు వచ్చింది. రైతన్నలను చేయిపట్టుకుని నడిపించింది. ఇటువంటి ఈ బ్యాంకు ఎన్నో ఒడిదుడికులును కూడా చూసింది. ఆప్కాబ్– వైఎస్సార్– మార్పులు.. గతంలో ఎన్నో ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు.. నాన్నగారు, ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి గారు కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పట్లో వైద్యనా«ధన్ సిఫార్సులను తాను ఆమోదించి.. సహకార పరపతి వ్యవస్ధ అంటే కోపరేటివ్ క్రెడిట్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం కోసం రూ.1850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇదొక్కటే కాకుండా రైతులకు మరింత మంచి జరగాలని 9 జిల్లా కేంద్ర సహకారబ్యాంకులు(డీసీసీబీ)కు అప్పట్లో రూ.217 కోట్లు షేర్ కేపిటల్‌గా ఇన్ఫ్యూజ్ చేసి సహకార రంగాన్ని ఆదుకున్నారు. పావలా వడ్డీ – రైతు రుణాలు.. రైతులకు మరింత తోడుగా నిలుస్తూ.. 2008 ఖరీప్ నుంచి పావలా వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్లీ అదే ఒడిదుడుకులు ఈ సహకార రంగంలో ఎదురవడం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును మళ్లీ నిలబెట్టాలి.. తోడుగా నిలబడాలని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టి.. వేగంగా అడుగులు కూడా వేస్తున్నాం. మరింత మెరుగ్గా ఆప్కాబ్... మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో నాబార్డ్ కన్సెల్టెన్సీ సర్వీసు అయిన నాబ్కాన్స్(నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైయివేట్ లిమిటెడ్) అధ్యయం చేయమని.. అప్కాబ్‌ను మెరుగైన పరిస్థితుల్లోకి ఎలా తీసుకొని పొగలుగుతామో అధ్యయనం చేయమని నాబ్కాన్స్ బృందానికి బాధ్యతలు అప్పగించాం. వారు దాదాపు ఏడాది టైం తీసుకుని.. ప్రతి బ్యాంకు తిరిగి ఉన్న పరిస్థితులు అన్నీ గమనించారు. కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రంలో సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించాం. అనంతరం కోపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ.. ఆప్కాబ్‌లో డీసీసీబీ బోర్డులలో ప్రొఫెషనల్స్ కూడా ఉండేటట్టుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే చర్యలు తీసుకున్నాం. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. సామర్ధ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్ డైరెక్టర్లు ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలుపెట్టారో.. అప్పుడు రాజకీయంగా వేరే అడుగులు వేసే కార్యక్రమాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పారదర్శకత, సామర్ధ్యం పెంచడంలో భాగంగానే... డీసీసీబీల సీఈఓల ఎంపిక కూడా రాష్ట్రస్ధాయిలో ఒక కామన్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి.. దాని ద్వారా చేయడం మొదలుపెట్టాం. తద్వారా డీసీసీబీల సీఈఓలను కూడా మరింత ప్రొఫెషనల్‌గా ఎన్నుకునే కార్యక్రమం తీసుకొచ్చాం. వీటితో పాటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు ఆప్కాబ్‌కు గత ఏడాది రూ.295 కోట్లు షేర్ కేపిటల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇన్ప్యూజ్ చేసింది. ఆప్కాబ్ – డిజిటలైజేషన్– కంప్యూటరైజేషన్ ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా వేసిన అడుగులు. ఇదొక్కటే కాకుండా.. మొత్తం ఆప్కాబ్ వ్యవస్ధలన్నింటిలోనూ కూడా పారదర్శకతను, సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ వ్యవస్ధలన్నింటిలోనూ డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్‌ను తీసుకుని వచ్చాం. టీసీఎస్‌ను ఇన్వాల్వ్ చేసి ఈ ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ప్యాక్‌కు పూర్తిగా అనుసంధానం అయిన వెంటనే.. పారదర్శకత, సామర్ధ్యం అన్నవి గణనీయంగా పెరుగుతాయి. నాలుగేళ్లలో ప్రగతి... ఈ చర్యలన్నింటి వల్ల రాష్ట్రంలో వ్యవసాయ పరపతి సంఘాల వ్యవస్ధ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఏ స్ధాయిలో అభివృద్ధి ఉందంటే... 2019 నుంచి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరిగాయి. ఆప్కాబ్ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31న.. మనం అధికారంలోకి వచ్చేనాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపు అయింది. అలాగే 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి నాలుగేళ్లలో 2023 నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. దాదాపు మూడురెట్లు పెరిగింది. లాభాల బాటలో డీసీసీబీలు... గత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయి. నిజంగా ఎంత బాగా నడుస్తున్నాయి అంటే 36 ఏళ్లు తర్వాత లాభాలు గడించిన కర్నూలు డీసీసీబీని ఇవాల మనం చూస్తున్నాం. 28 సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డీసీసీబిని కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇంత గొప్ప అడుగులు వేయగలిగినందుకు, వేయించినందుకు సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు... ఇంతకముందు నేను చెప్పినట్టుగా.. ఎప్పుడైతే డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ పూర్తవుతుందో, ఆప్కాబ్, డీసీసీబీల బలోపేతం ప్యాక్స్(పీఏసీఎస్) వరకు తీసుకుని రావడం ఎప్పుడు పూర్తవుతుందో... అప్పుడు ఇవాళ మనం చూస్తున్న మార్పు కన్నా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూస్తాం. దీనికోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు నిధులు కేటాయించాం. వాటితో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదొక్కటే కాకుండా ప్యాక్స్‌ను ఆర్బీకేలకు అనుసంధానం చేసే గొప్ప మార్పు కూడా జరిగింది. రైతును ప్రతి అడుగులోనూ గ్రామస్ధాయిలో చేయిపట్టుకుని నడిపిస్తున్న వ్యవస్ధ.. రైతు భరోసా కేంద్రాలు. ఈ ఆర్బీకేలను ప్యాక్స్‌కు అనుసంధానం చేశాం. ఆ తర్వాత ఈ వ్యవస్ధను డీసీసీబీకి అనుసంధానం చేశాం. డీసీసీబీ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం చేసే గొప్ప ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు మిగిలిన బ్యాంకుల సహాయసహకారాలతో ప్రతి ఆర్బీకేలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కూడా అందుబాటులో ఉన్నారు. డిజిటలైజేషన్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో అనుసంధానం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు గ్రామస్ధాయిలోనే జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. రైతులకు ఆర్బీకే వద్దే క్రెడిట్- అగ్రీ ఇన్పుట్స్.. రైతులకు ఆర్బేకేల వద్దనే క్రెడిట్‌తో సహా వ్యవసాయ ఇన్పుట్స్ పొందే వీలు కూడా రాబోయే రోజుల్లో మన కళ్లెదుటనే కనిపించే పరిస్థితి వస్తుంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అక్కడే ఉన్నారు, ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ ఇ–క్రాపింగ్ జరుగుతుంది. మొత్తం డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ జరుగుతుంది. ఇన్ని కనిపిస్తున్నప్పుడు సహజంగానే ఆర్బీకే స్ధాయిలోనే క్రెడిట్ ఇవ్వడం అన్నది రాబోయే రోజుల్లో మనం చూడబోయే గొప్ప మార్పు అవుతుంది. ఈ రోజు రైతులందరికీ కూడా ఆప్కాబ్ సేవలు విస్తరిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఆప్కాబ్, డీసీసీబీలు ఏ స్ధాయిలో ఇన్వాల్వ్ అయ్యాయంటే... ఆర్బీకే స్ధాయిలోనే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అంటే ఫామ్‌మెకనైజేషన్‌ను తీసుకొచ్చాం. రైతులు గ్రూపుగా ఏర్పడి 10 శాతం కడితే.. 40శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం ప్రభుత్వ నుంచి సబ్సిడీ వస్తుంది. పెద్ద పెద్ద వ్యవసాయ ఉపకరణాలు ఆర్బీకే స్ధాయిలోనే అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఏకంగా ఆప్కాబ్ దగ్గర నుంచి రూ.500 కోట్ల రుణాలు మంజూరు కూడా జరిగింది. రైతు- గ్రామం రెండూ బాగుండాలని... గ్రామీణ వ్యవస్ధలో రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే.. గ్రామస్ధాయిలో వ్యవసాయంతోపాటు పాడి, పంట వారి ఆర్ధిక స్వావలంబన కూడా ముడిపడి ఉన్నాయి. గ్రామీణ వ్యవస్ధలో అక్కచెల్లెమ్మలు, రైతులు వీళ్లంతా ఆర్ధికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్ధ బ్రతుకుతుంది. అటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే గొప్ప అడుగు కూడా ఆప్కాబ్ ద్వారా పడింది. దానివల్ల పాడి, పంట విపరీతంగా పెరిగాయి. ఇవాల మనం ఇస్తున్న చేయూత, ఆసరా, సున్నావడ్డీ వీటన్నింటినీ బ్యాంకులతో అనుసంధానం చేసి, ఆ డబ్బులను సరైన పద్ధతితో వాడుకోగలిగితే... అమూల్ లాంటి సంస్ధ గ్రామస్ధాయిలోకి రావడం ఎప్పుడు మొదలుపెడుతుందో.. అప్పుడు ఏ రైతన్న, అక్కచెల్లెమ్మ మోసపోకుండా మంచి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ స్ధాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితిలుండేవి. ఆప్కాబ్ వీటన్నింటిలో ముందడుగు వేస్తూ.. అన్ని రంగాల్లో విస్తరించి, గ్రామస్ధాయిలో రుణాలు ఇప్పించగలిగే స్ధాయిలోకి ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానం అయిన ఆర్బీకేలు.. ఈ పంపిణీ వ్యవస్ధ బహుశా దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకూ లేని విధంగా.. మన ఆప్కాబ్‌కు ఉంటుంది. ఆప్కాబ్– భారీ నెట్వర్క్.... ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్యాక్స్‌కు అనుసంధానం, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, అక్కడ నుంచి డీసీసీబీ, అక్కడ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం ఈ రకమైన భారీ నెట్వర్క్ ఏ బ్యాంకుకూ లేదు. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతి గ్రామంలోనూ డిజిటల్ లైబ్రరీలు తయారవుతున్నాయి. గ్రామస్ధాయిలోకి ఫైబర్ గ్రిడ్ చేరుకుంటుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. ఆప్కాబ్ ఇంకా గొప్పగా ఎదగాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని ఆకాంక్షిస్తూ..సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
APCO: కేరళ కుట్టిలకు ఆంధ్రా వస్త్రాలు
సాక్షి, అమరావతి: మలయాళీ సీమలో ఆంధ్రా చేనేత వస్త్రాల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆప్కోతో కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హ్యాండ్ వీవ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ చైర్మన్ గోవిందన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణాచలం సుకుమార్, మార్కెటింగ్ మేనేజర్ సందీప్ రెండు రోజుల క్రితం ఏపీలో పర్యటించి చేనేత వస్త్రాల తయారీ, ఆప్కో ద్వారా విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వీసీ అండ్ ఎండీ చదలవాడ నాగరాణితో చర్చించారు. ఏపీలో చేనేత వస్త్రాలు, వాటి డిజైన్లు, నాణ్యత బాగున్నాయని, వాటిని కేరళలోని స్టాల్స్‌లో విక్రయిస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా కేరళ ప్రభుత్వం చేనేత సొసైటీల కోసం నిర్వహిస్తున్న 30 అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత వస్త్రాలను విక్రయించనున్నారు. ఏపీలో చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెడుతున్న పొందూరు, ఉప్పాడ, పెడన, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలకు చెందిన వస్త్రాలను కేరళలోని స్టాల్స్‌లో విక్రయాలకు ఉంచనున్నారు. ప్రధానంగా కేరళలో ఘనంగా నిర్వహించే ఓనం, క్రిస్మస్, రంజాన్ మాసాల్లో ఏపీ చేనేత వస్త్రాలను అత్యధికంగా విక్రయించేలా ఆప్కో కార్యాచరణ చేపట్టింది. కలంకారీ వస్త్రాలను కొనుగోలు చేసిన హెన్‌టెక్స్ కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన హెన్‌టెక్స్ (కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ఇప్పటికే ఏపీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లింది. నాలుగు రోజుల క్రితం పెడనలో పర్యటించిన హెన్‌టెక్స్ బృందం కలంకారీ వస్త్రాలపై అమితాసక్తి చూపించింది. పెడన కలంకారీ డిజైన్లతో కూడిన రూ.29.50 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయడం గమనార్హం. చేనేతకు ఊతమివ్వడమే లక్ష్యం రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కేరళలోని ప్రభుత్వ అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకున్నాం. ఏపీ చేనేత సొసైటీల ప్రతినిధులు కేరళలోని స్టాల్స్‌కు వస్త్రాలు సరఫరా చేసి, నెలలోపులోనే విక్రయాలకు సంబంధించిన మొత్తాలను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఆప్కోకు కేవలం 2 శాతం సర్వీస్ రుసుం వసూలు చేస్తాం. – చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, ఆప్కో చైర్మన్ చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు -
నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ఆప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలలా ఆప్కో షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. చీరలు, చుడీదార్లు, పెళ్లి బట్టలు చాలా రకాల వెరైటీల్లో దొరుకుతున్నాయన్నారు. మహిళల మనసు దోచే విధంగా ఆప్కోలో చీరలు ఉన్నాయన్నారు. బయట షోరూమ్‌లకు ధీటుగా ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయన్నారు. తాను కూడా చేనేత కుటుంబ కోడలినని మంత్రి రోజా తెలిపారు. నేతన్నలకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు అందిస్తున్నారని అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరిద్దామని ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ఆప్కో ఫ్యాషన్ షో
సాక్షి, అమరావతి: నూతన ఒరవడికి ఆప్కో శ్రీకారం చుట్టింది. సరికొత్త డిజైన్లతో కూడిన చేనేత వస్త్రశ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. విజయవాడ ఆప్కో మెగా షోరూమ్‌లో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. సంక్రాంతి సంబరాలను ముందుగానే ఆప్కో ఆవిష్కరించింది. చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డిజైన్ల వ్రస్తాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. చేనేత వ్రస్తాలంటే వయోజనులు, వృద్ధులకే అన్న నానుడిని తుడిచివేస్తూ ర్యాంప్ వాక్ సాగింది. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన అన్నిరకాల చేనేత వ్రస్తాలను ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. మోడల్స్‌తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛందంగా ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. కండువాల నుంచి పంచెలు, చీరల వరకు మంగళగిరి ఫైన్ కాటన్, ఉప్పాడ పట్టు, జాంథానీ బుటా, అంగర సీకో కాటన్, పెడన కాటన్, పోలవరం, ఐదుగుళ్లపల్లి, వేంకటగిరి కాటన్, సిల్క్ చీరలు, మాధవరం కాటన్, చీరాల, కుప్పడం, ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు, మంగళగిరి, చీరాల డ్రెస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్ పంచెలు, షర్టింగ్స్, కండువాలు, భట్టిప్రోలు కాటన్ పంచెలు, మంగళగిరి, చెరుకుపల్లి, చీరాల కాటన్ షర్టింగ్స్, పొందూరు ఖాదీ పంచెలు, కండువాలు, రెడీమేడ్ షర్టింగ్స్, లేడీస్ టాప్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో ఆప్కో అధికారులు పాల్గొన్నారు. ఏలూరు రోడ్లో ఆప్కో మెగా షోరూం హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఫ్యాషన్ షో దృశ్యాలు -
ఆప్కాబ్ ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయశాఖమంత్రి కురుసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలో కొత్త అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆప్కాబ్, సహకారశాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, సహకార సంఘాల అభున్నతికి సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘ఆడిట్ విధానాన్ని బలోపేతం చేయడం , పూర్తి స్థాయిలో సహకార సంఘాల కంప్యూటీకరణ , మానవ వనరుల పాలసీ తదితర నిర్ణయాలను తీసుకున్నాం. అప్కాబ్‌కు తొలి మహిళా పర్సన్ ఇన్ ఛార్జ్ గా మల్లెల ఝాన్సీ ని సీఎం నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత అప్కోబ్ చాల ఒడిదుడుకులను చూసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి నాలుగు జిల్లాల్లో సహకార కేంద్ర బ్యాంకులు నష్టాల్లో ఉండేవి. ఈ ప్రభుత్వ పారదర్శక నియమాలు, నియంత్రణ, ఇతర చర్యల వల్ల నేడు అన్ని జిల్లాల డీసీసీబీ లు లాభాల బాటలో పడ్డాయి. ఈ ఏడాది 31 వేల కోట్ల రూపాయిల టర్నోవర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్కాబ్లో ప్రతి రూపాయి రైతు కష్టం, అత్యంత బాధ్యతగా, నిజాయితీగా రైతు డబ్బు ను మనమంతా కాపాడాలి. నిధుల దుర్వినియోగం , విధుల పట్ల నిర్లక్ష్యం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారు. గుంటూరు సహా పలు జిల్లాల డీసీసీబీలు చాల బాగా నడుస్తున్నాయి , రైతుకు , చిరు వ్యాపారాస్థులకు ఉపయోగపడే వివిధ స్కీములను అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు అప్పులిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల నియమితులైన అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లకు , డీసీఎంఎస్ చైర్మన్లకు అభినందనలు’ తెలిపారు మంత్రి కన్నబాబు. -
ఏపీ ఆప్కాబ్‌లో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్).. ఐబీపీఎస్ ద్వారా మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 61 ► పోస్టుల వివరాలు: మేనేజర్(స్కేల్1)–26, స్టాఫ్ అసిస్టెంట్లు–35. ► మేనేజర్(స్కేల్1): స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్. అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టాఫ్ అసిస్టెంట్లు: అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021 ► ఆన్లైన్ టెస్ట్ తేది: 2021 సెప్టెంబర్ మొదటి వారం ► వెబ్సైట్: https://www.apcob.org ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 46 బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కి చెందిన సెక్రటరీ కార్యాలయం.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 46 ► పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్–01(ఎస్సీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ)–38(ఎస్సీ–17, ఎస్టీ–21), కేర్ టేకర్/వార్డెన్(ఎస్సీ–04, ఎస్టీ–03) ► ఎంపిక విధానం: ఎలాంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: www.jnanabhumi.ap.gov.in డీఎంహెచ్‌వో, అనంతపురంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు 01.07.2021 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో శాశ్వత ప్రాతిపదికన రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.53,495 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వివిధ ప్రాంతాల్లో చేసిన పని ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021 ► వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in -
'నాబార్డ్ నుంచి రాయితీలు రావడం కష్టమే'
ఒంగోలు: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆప్కాబ్‌కు నాబార్డు నుంచి రాయితీలు రావటం కష్టంగా మారిందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం సదస్సులో పిన్నమనేని మాట్లాడుతూ... ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఆప్కాబ్‌కు ఉంటే నాబార్డు నుంచి రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రూ.7 వేల కోట్లు, తెలంగాణలో రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు నాబార్డు నుంచి రాయితీలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారు. -
‘ఆప్కాబ్’ భవితవ్యంపై బదులివ్వలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) భవితవ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తన వద్ద సమాధానం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్ముందు ఆప్కాబ్ తీరుతెన్నులెలా ఉండబోతాయో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆప్కాబ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్లో జరిగిన స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యతు ్తలో కూడా ఆప్కాబ్ ఇలాంటి వేడుకలను జరుపుకుంటుందా, లేక ఇదే ఆఖరుది అవుతుందా అని కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్బక్షి కిరణ్‌ను ప్రశ్నించారు. ఆయన చాలా పెద్ద ప్రశ్నే అడిగారన్న కిరణ్, ప్రస్తుతం తనకు జవాబు తెలిదని బదులిచ్చారు. ఆప్కాబ్‌కు ఉజ్వల భవిష్యత్తుండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి అమరనాథరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ వల్ల రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి లభిస్తోందన్న కిరణ్, అదే సమయంలో రైతులకు కూలీల ఖర్చు పెరిగిపోయి సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాగులో సగటున ఎకరాకయ్యే కూలీల ఖర్చులో 30 శాతాన్ని రైతుకు అందించేలా ఉపాధి పథకాన్ని అనుసంధానించాల్సిన అవసరముందన్నారు. ముల్కనూరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుల కాలపరిమితి పెంచాలి: బక్షి కౌలు రైతులకు బ్యాంకు రుణాలందించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితి ఏడాదే ఉండటంతో వారికి ఏటా రుణాలందడం కష్టమవుతోందని బక్షి అన్నారు. కౌలుదారీ చట్టాన్ని సవరించో, మరో మార్గం ద్వారానో దీర్ఘ కాలపరిమితి ఉండేలా కార్డులు మంజూరు చేయాలని కోరారు.