సాక్షి, అమరావతి: నూతన ఒరవడికి ఆప్కో శ్రీకారం చుట్టింది. సరికొత్త డిజైన్లతో కూడిన చేనేత వస్త్రశ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. విజయవాడ ఆప్కో మెగా షోరూమ్‌లో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. సంక్రాంతి సంబరాలను ముందుగానే ఆప్కో ఆవిష్కరించింది. చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డిజైన్ల వ్రస్తాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
చేనేత వ్రస్తాలంటే వయోజనులు, వృద్ధులకే అన్న నానుడిని తుడిచివేస్తూ ర్యాంప్ వాక్ సాగింది. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన అన్నిరకాల చేనేత వ్రస్తాలను ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. మోడల్స్‌తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛందంగా ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు.
కండువాల నుంచి పంచెలు, చీరల వరకు
మంగళగిరి ఫైన్ కాటన్, ఉప్పాడ పట్టు, జాంథానీ బుటా, అంగర సీకో కాటన్, పెడన కాటన్, పోలవరం, ఐదుగుళ్లపల్లి, వేంకటగిరి కాటన్, సిల్క్ చీరలు, మాధవరం కాటన్, చీరాల, కుప్పడం, ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు, మంగళగిరి, చీరాల డ్రెస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్ పంచెలు, షర్టింగ్స్, కండువాలు, భట్టిప్రోలు కాటన్ పంచెలు, మంగళగిరి, చెరుకుపల్లి, చీరాల కాటన్ షర్టింగ్స్, పొందూరు ఖాదీ పంచెలు, కండువాలు, రెడీమేడ్ షర్టింగ్స్, లేడీస్ టాప్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో ఆప్కో అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు రోడ్‌లో ఆప్కో మెగా షోరూం హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఫ్యాషన్ షో దృశ్యాలు
Comments
Please login to add a commentAdd a comment