socila welfare schools
-
ఏపీ ఆప్కాబ్‌లో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్).. ఐబీపీఎస్ ద్వారా మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 61 ► పోస్టుల వివరాలు: మేనేజర్(స్కేల్1)–26, స్టాఫ్ అసిస్టెంట్లు–35. ► మేనేజర్(స్కేల్1): స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్. అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టాఫ్ అసిస్టెంట్లు: అర్హత: 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021 ► ఆన్లైన్ టెస్ట్ తేది: 2021 సెప్టెంబర్ మొదటి వారం ► వెబ్సైట్: https://www.apcob.org ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 46 బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కి చెందిన సెక్రటరీ కార్యాలయం.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 46 ► పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్–01(ఎస్సీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ)–38(ఎస్సీ–17, ఎస్టీ–21), కేర్ టేకర్/వార్డెన్(ఎస్సీ–04, ఎస్టీ–03) ► ఎంపిక విధానం: ఎలాంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: www.jnanabhumi.ap.gov.in డీఎంహెచ్‌వో, అనంతపురంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు 01.07.2021 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో శాశ్వత ప్రాతిపదికన రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.53,495 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వివిధ ప్రాంతాల్లో చేసిన పని ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021 ► వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in -
గురుకులాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో 497 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు. ధరఖాస్తు రుసుం రెట్టింపు: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సమీపంలోని మీ–సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది దరఖాస్తు రూ.50 ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. ఈనెల 18వ తేదీనుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది. దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800–425–45678 నంబర్లో.. లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్సైట్లను చూడాలని సెట్ చీఫ్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మైనార్టీల్లో ప్రత్యేకం ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి సీట్లభర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలకోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా అన్ని గురుకుల సొసైటీల్లో 6 నుంచి 10వ తరగతి వరకున్న ఖాళీల భర్తీకి కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తారు. వీటి భర్తీ ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీలపై ఆధారపడి ఉంటుంది. -
30న 6, 7 తరగతుల ప్రవేశానికి కౌన్సెలింగ్
బెల్లంపల్లి : కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశానికి ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. 6వ తరగతిలో బాలురకు 120, బాలికలకు 120, 7వ తరగతిలో బాలురకు 90, బాలికలకు 120 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీ కోసం ఇదివరకే ప్రవేశ పరీక్ష రాసి వేయింటింగ్ లిస్ట్‌లో ఉన్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. విద్యార్థుల పక్షాన తల్లిదండ్రులు హాజరుకావచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల పత్రంతో హాజరుకావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారీగా సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు.