30న 6, 7 తరగతుల ప్రవేశానికి కౌన్సెలింగ్‌ | socila welfare schools admission counsilling on30th | Sakshi
Sakshi News home page

30న 6, 7 తరగతుల ప్రవేశానికి కౌన్సెలింగ్‌

Published Sat, Aug 27 2016 11:09 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

socila welfare schools admission counsilling on30th

బెల్లంపల్లి : కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశానికి ఈ నెల 30న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. 6వ తరగతిలో బాలురకు 120, బాలికలకు 120, 7వ తరగతిలో బాలురకు 90, బాలికలకు 120 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీ కోసం ఇదివరకే ప్రవేశ పరీక్ష రాసి వేయింటింగ్‌ లిస్ట్‌లో ఉన్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. విద్యార్థుల పక్షాన తల్లిదండ్రులు హాజరుకావచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల పత్రంతో హాజరుకావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారీగా సీట్లలో రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement