మహబూబ్‌నగర్ క్రైం: పోలీసు శాఖలో ఏడేళ్లుగా విధులు నిర్వహించిన 11మంది హోంగార్డులను ఆధికారులు ఏకపక్ష ంగా ఉద్యోగాలనుంచి తొలగించారని మీరైనా మాకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధిత హోంగార్డులు సోమవారం జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న 13 మంది హోంగార్డులను 2013లో వివిధ కారణాలతో అప్పటి జిల్లా ఆధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు.
దీంతో బాధితులు కోర్టును అశ్రయించడంతో వెంటనే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని 03-12-2013న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు కోర్టు ఆర్డర్ కాపీతో అప్పటి జిల్లా ఆధికారులు. హోంగార్డు విభాగం ఆధికారులను కలిశారు. అరుుతే ఆధికారులు వారిని విధుల్లోకి తీసుకోకుండా కోర్టుకు ఎలా వెళతారని వారిపైనే మండిపడ్డారు. కాగా వారిలో రాజకీయ నేతల ఒత్తిడి మేరకు ఇద్దరిని మాత్రం విధుల్లోకి తీసుకున్నారు.
మిగతా వారిని మాత్రం మిమ్మల్ని ఉద్యోగాలనుంచి తొలగిం చాం..మరోసారి హోంగార్డుల సెలక్ష న్స్ జరిగితే మీకే మొదటి ప్రాధాన్యమని చెప్పి వెనక్కి పంపారు.దీంతో బాది తులు అప్పటి జిల్లా ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామన్నా సంబందిత ఆధికారులు వారికి ఆవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో వారు రాష్ట్ర మంత్రి హరిష్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవిం చడంతో అయన వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించినా ఆధికారులు పట్టించుకోలేదు. దీనికి తోడు మంత్రి వద్దకు వెళ్లినందుకు వారిని మరింత భయందోళనకు గురి చేశారు.
దీంతో బాధితులు సమాచార హక్కు చట్టం ద్వారా తమ ఉద్యోగాల జాబితా ఇవ్వాలని కోరగా హోంగార్డు విభాగానికి చెందిన ఆర్‌ఐ వారితో బలవంతంగా సంతకం చేయిం చుకుని ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో బాదితులు సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విశ్వప్రసాద్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చారు. అరుుతే కొందరు అధికారులు వారిని జిల్లా ఎస్పీతో కలవకుండా బుజ్జగించి వారం తర్వాత వస్తే సారుతో చెప్పి మీకు న్యాయం చేస్తామని బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సంవత్సర కాలంగా ఎస్పీ కార్యాలయం చుట్టు తిరుగుతున్నామని ...ఒక్కసారైనా ఎస్పీని కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు ఆవకాశం కల్పించాలని..కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని బాధితుల్లో ఒకరైన తిరుపతయ్య వేడుకున్నాడు.
ఉద్యోగాలు ఇప్పించండి సారూ...!
Published Tue, Nov 11 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement